‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ఫస్ట్ సింగిల్.. అలా సాయమందించిన సురేందర్ రెడ్డి
పవన్ తేజ్ కొణిదెల అనే కొత్త హీరోగా తెరపైకి పరిచయం చేస్తూ.. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ఈ కథలో పాత్రలు కల్పితం'. పవన్ తేజ్ కొణిదెల సరసన మేఘన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ నుంచి తాజాగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కథలో పాత్రలు కల్పితం ఫస్ట్ సింగిల్ అయిన 'కన్నయే కళ్ళు' ఈ రోజు మధ్యాహ్నం 03:02నిమిషాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. 'ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన సురేందర్ రెడ్డిగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథలో పాత్రలు కల్పితం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆర్టిస్టులు, టెక్నిషయన్స్ నుండి మంచి సపోర్ట్ లభించింది. మా మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి పాజిటివ్ బజ్ క్రియేట్ అవడంతో మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుందని భావిస్తున్నాము. దర్శకుడు అభిరామ్ మంచి విజన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించారు. 'జెస్సీ', రీసెంట్ గా వచ్చిన ఓ పిట్టకథ..సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ విజువల్స్, 'ఆర్‌ఎక్స్ 100', 'కల్కి' చిత్రాలకు డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలెట్ అన్నారు.

డైరెక్టర్ అభిరామ్ మాట్లాడుతూ.. 'హీరో పవన్ తేజ్ కొణిదెలకు ఈ సినిమా తప్పకుండా మంచి పేరు తెస్తుంది. కథ, కథనాలతో పాటు కార్తిక్ కొనకండ్ల అందించిన సంగీతం ఈ మూవీకి పెద్ద బలం. నిర్మాత రాజేష్ నాయుడు గారి సహకారంతోనే సినిమాను ఇంత రిచ్‌గా, అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించగలిగాము. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని' అన్నారు.


Click it and Unblock the Notifications











