Just In
Don't Miss!
- Sports
KKR vs MI: ఇలాంటి మ్యాచులు తరచూ జరగవు.. ఈ విజయం బౌలర్లదే: రోహిత్
- Finance
హోమ్‌లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: అందుకే.. అలాగే
- News
కుంభమేళా.. మరో తబ్లిగీ జమాత్: వెయ్యికి పైగా కరోనా కేసులు: ఆ పోలిక వద్దంటోన్న సీఎం
- Lifestyle
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్షమించమని కోరిన నిర్మాణ సంస్థ.. ఊగిపోతోన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుంచి చివరి సాంగ్‌ను సర్ ప్రైజ్‌గా ఇద్దామని చిత్ర నిర్మాణ సంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ భావించింది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ మేరకు తమన్ కూడా ఓ ప్రకటన చేశాడు. రేపు యూట్యూబ్‌లో రిలీజ్ కాబోతోందంటూ పాటపై అంచనాలు పెంచేశాడు. అలా తమన్ ఇచ్చిన హైప్, చిత్ర యూనిట్ క్రియేట్ చేసిన బజ్‌తో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూడసాగారు.
అందంతో ఆకట్టుకొంటున్న సోని చరిష్టా.. ఎద అందాలతో యువ హీరోయిన్ రచ్చ

ప్రీ రిలీజ్ ఈవెంట్..
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్‌లో దర్శక నిర్మాతలు, బండ్ల గణేష్ మాట్లాడిన స్పీచ్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సుధీర్ఘ స్పీచ్ అందరినీ కదిలించింది.
అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

స్పెషల్ సాంగ్..
ఇంత వరకు వకీల్ సాబ్ నుంచి మూడు పాటలే వచ్చాయి. గతేడాది వదిలిన మగువా మగువా సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గత మార్చి నెలలో వదిలిన సత్యమేవ జయతే, కంటి పాప పాటలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఇక చివరి పాటను ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్‌లా ప్లాన్ చేశారు.
యువ హీరోయిన్ కియా గ్లామరస్ ఫోటోషూట్

విడుదలకు ముందు..
ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కాబోతోండగా.. కొన్ని రోజుల ముందుగానే నాల్గో పాట అయిన కదులు కదులు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే దీని కోసం మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు పాటను విడుదల చేస్తామని అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు.
అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

క్షమాపణలు..
వకీల్ సాబ్ నుంచి రావాల్సిన కదులు కదులు అనే పాటను సరైన సమయానికి తీసుకురాలేకపోతోన్నాం.. సాంకేతిక కారణాల దృష్ట్యా ఆలస్యం అవుతోంది.. ఇలా మిమ్మల్ని ఎదురుచూసేలా చేసినందుకు క్షమించండి అని దిల్ రాజు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

ఊగిపోతోన్న ఫ్యాన్స్..
పాట ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఊగిపోతోన్నారు. ఇలా అంటారని మాకు ముందే తెలుసు అని కొందరు.. కనీసం ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వు అని ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి కదులు కదులు పాట కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.