For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ బాబు అక్కడ తుఫాను సృష్టించడం పక్కా: థమన్ పవర్ఫుల్ అప్డేట్

  |

  పాన్ ఇండియా సినిమాలు ఎన్ని తెరకెక్కుతున్న కూడా కొన్ని లోకల్ సినిమాలు మాత్రం అంతకంటే ఎక్కువ స్థాయిలో టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ లిస్టులో మహేష్ బాబు సర్కారు వారి పాట మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఈసారి అంతకంటే హై రేంజ్ లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. గీతగోవిందం అనంతరం దర్శకుడు పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

  ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ట్విట్టర్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక లైక్స్ అందుకోవడమే అత్యధిక రీట్వీట్స్ పొందిన పోస్టర్ గా కూడా రికార్డు సృష్టించింది. ఇక దానికి తోడు సంగీత దర్శకుడు థమన్ కూడా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ టీజర్ లో మహేష్ బాబు ఎలా కనిపిస్తాడు అనే విషయంలో ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక క్లారిటీ వచ్చేసింది. దానికి తోడు థమన్ కూడా తన ట్వీట్స్ తో మరింత హైప్ పెంచుతున్నాడు.

  Thaman Strom tweet on Mahesh babu sarkaru vaari paata

  రీసెంట్ గా టీజర్ మొత్తాన్ని మరోసారి చూసిన థమన్ తప్పకుండా మహేష్ బాబు ట్విట్టర్ లో ఒక తుఫాను క్రియేట్ చేయడం పక్కా అంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఇక సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో విడుదల కానున్న ఈ టీజర్ లో మహేష్ బాబు సరికొత్తగా యాక్షన్ ఎంట్రీ ఇస్తాడు అని తెలుస్తోంది. అభిమానులైతే ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అంతకుమించి అనేలా దర్శకుడు పరశురామ్ హీరోని ఎలివేట్ చేసినట్లు సమాచారం. ఇదివరకే దర్శకుడు ఈ సినిమాలో మహేష్ అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా అభిమానులైతే చొక్కాలు చింపుకునేలా సినిమా ఉంటుందని కామెడీ ఎంటర్ టైనర్ తో పాటు మంచి రొమాంటిక్ సీన్స్ అలాగే మంచి సందేశం కూడా ఉంటుందని వివరణ ఇచ్చాడు.

  ఇక ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మొదటిసారి మహేష్ బాబుతో జతకడుతున్న విషయం తెలిసిందే. వారికి సంబంధించిన సీన్స్ క్యూట్ అండ్ రొమాంటి కామెడీగా ఉంటాయట. దర్శకుడు పరశురామ్ హీర హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీని ఏవిధంగా హైలెట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదివరకే గీతగోవిందం సినిమాతో ఆ విషయాన్ని నిరూపించాడు.

  ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు కీర్తి సురేష్ లాంటి అందమైన హీరోయిన్ జోడిగా అంటే తప్పకుండా అంచనాలకు మించిన లవ్ సీన్స్ ఉంటాయని చెప్పవచ్చు. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. పోటీగా మిగతా స్టార్స్ పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ మహేష్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద సర్కారు వారి పాట ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

  English summary
  Block your calendars and Lock your plans, Lets Begin the SuperStar Birthday Extravaganza. Super Star Birthday BLASTER on AUG 9th 9:09 AM
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X