Chiru 153: థమన్ కు టైమొచ్చింది.. మెగా మోత మామూలుగా ఉండదట!

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అల.. వైకుంఠపురములో సినిమా అనంతరం తన రూట్ ను మొత్తం మార్చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా అగ్ర హీరోలతో వర్క్ చేస్తున్నాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాకు అదిరిపోయేలా ట్యూన్స్ సెట్ చేసిన థమన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను ఎనౌన్స్ చేయడంతో ఎదో ఆఫర్ రాకపోదా అని ఎదురుచూస్తున్న థమన్ మొత్తానికి మంచి ఆఫర్ ను పట్టేశాడు. లూసిఫర్ రీమేక్ కోసం ట్యూన్స్ రెడీ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేశాడు. దర్శకుడు మోహన్ రాజా సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Thaman upcoming movie chiru 153 songs composition work started

ఇక రీసెంట్ గా మోహన్ రాజా థమన్ ను కలవగా ఇద్దరు మ్యూజిక్ పై చర్చలు మొదలు పెట్టినట్లు క్లారిటి ఇచ్చారు. ఈసారి సూపర్ హై స్టఫ్ ఉంటుందని థమన్ ఫొటోలు పోస్ట్ చేస్తూ వివరణ ఇచ్చాడు. చూస్తుంటే థమన్ మరో మెట్టు ఎక్కేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాబోయేవి కూడా మరికొన్ని పెద్ద సినిమాలే. అందులో పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో పాటు త్రివిక్రమ్ - మహేష్ సినిమా కూడా ఉంది. అలాగే శంకర్ - రామ్ చరణ్ పాన్ ఇండియాకు కూడా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి మరి కొన్నేళ్ల వరకు థమన్ కు పోటీ లేదని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X