twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్వెల్ ఆంథెమ్: ఏఆర్ రెహమాన్ చెత్తగా కంపోజ్ చేశాడంటూ విమర్శలు!

    |

    ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ వారితో కలిసి ఇండియాలో 'అవేంజర్స్ ఎండ్ గేమ్' మూవీ ప్రమోషన్ కోసం స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశారు. ఏప్రిల్ 1న ఈ పాటను విడుదల చేశారు.

    ఏఆర్ రెహమాన్ లాంటి నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ నుంచి సాంగ్ వస్తుందంటే అంచనాలు ఓ రేంజిలో ఉండటం సర్వసాధారణం. అయితే ఈ పాట అభిమానుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. సాంగ్ విడుదలైన వెంటనే చెత్తగా ఉదంటంటూ కామెంట్ల వర్షం మొదలైంది.

    మార్వెల్ ఆంథెమ్

    ‘‘మార్వెల్ ఇండియా అభిమానుల కోసం ఏదైనా స్పెషల్‌గా చేయాలనే ఆలోచనలో భాగంగా మేస్ట్రో ఏఆర్ రెహమాన్ ద్వారా మార్వెల్ ఆంథెమ్ కంపోజ్ చేయించడం జరిగింది.'' అని పేర్కొంటూ మార్వెల్ ఇండియా సంస్థ ఏప్రిల్ 1న సాయంత్రం ట్విట్టర్ ద్వారా ఈ సాంగ్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు దీనికి 1.5 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినప్పటికీ ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    చెత్త సాంగ్

    ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ‘మార్వెల్ ఆంథెమ్' సాంగ్ చాలా చెత్తగా ఉంది. రెహమాన్ లాంటి టాప్ కంపోజర్ నుంచి ఇలాంటి సాంగ్ వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆ పాటలో ఎలాంటి ఫీలింగ్ లేదు అంటూ ట్విట్టర్లో విమర్శల వర్షం వెల్లువెత్తుతోంది.

    2 స్టార్ రేటింగ్ కంటే ఎక్కువ ఇవ్వలేం

    సాంగ్ కంపోజింగ్, చిత్రీకరించిన తీరు చాలా చెత్తగా ఉంది. దీనికి 2/5 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వలేమని కొందరు. వెరీ వెరీ బ్యాడ్ సాంగ్ అంటూ మరికొందరు, రెహమాన్ నుంచి టెర్రబుల్ కంపోజిషన్ అంటూ ఇంకొందరు ట్వీట్స్ మీద ట్వీట్స్ చేశారు.

    అవెంజర్స్ ఎండ్ గేమ్

    అవెంజర్స్ ఎండ్ గేమ్

    ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్' మూవీ విషయానికొస్తే... ఆంటోనీ, జియో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ ఇండియాలో భారీ విజయం అందుకుంది. దానికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ కావడంతో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్' మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' సినిమా ముగించిన తీరు సీక్వెల్ పార్ట్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అందులో థానోస్ అనే విలన్ అవెంజర్స్ అందరినీ అంతం చేయడం అభిమానులకు షాకిచ్చింది. మరి నిజంగానే అవెంజర్స్ అంతం అయ్యారా? అనేది ‘అవెంజర్స్: ఎండ్ గేమ్'‌లో చూపించబోతున్నారు.

    English summary
    Music composer AR Rahman recently teamed up with Marvel Studios to create an anthem before the release of their upcoming film Avengers Endgame. Marvel Studios took to Twitter to unveil the Marvel Anthem on April 1. Twitterati is very unhappy with Marvel Anthem.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X