ఉప్పెన ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు వచ్చారు. ఈ జాబితాలోకి చేరేందుకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సిద్దంగా ఉన్నాడు. ఉప్పెన అంటూ వెండితెరకు పరిచయం కాబోతోన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా అందరిలోనూ ఆసక్తిని రేకిత్తించిన చిత్రయూనిట్.. మరో అప్‌డేట్‌ను వదిలింది.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కథలో భాగంగా వైష్ణవ్ తేజ్ జాలరిగా కనిపిస్తాడని తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లి వృత్తిలో ఉండే హీరో.. పూర్తిగా రా లుక్‌లో కనిపిస్తాడనటి టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ అంచనాలు పెంచేయగా.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై హైప్ పెంచేసింది.

ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉప్పెన సాంగ్స్ ప్రత్యేకమైనవి చెప్పుకొచ్చాడు. పూర్తి ఆల్బమ్ కూడా లవ్ అండ్ రొమాంటిక్‌గా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు. తాజగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. రేపు (ఫిబ్రవరి 5) ఉదయం 9.09గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుకుమార్ రైటింగ్స్ - మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామని అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











