Don't Miss!
- News
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Kodthe special song: గనిలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసిన టీమ్
మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రం మంచి సక్సెస్ రేటును అందుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనలోని టాలెంట్లను చూపిస్తూ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. దీంతో స్టార్ ఇమేజ్‌తో పాటు పలు విజయాలు కూడా అతడి సొంతం అయ్యాయి. ఇక, ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!
కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్ 24కు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18కి వాయిదా వేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే.
దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో
'గని' మూవీ విడుదల వాయిదా పడుతున్నా.. దీని నుంచి మాత్రం అప్‌డేట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్స్ వీడియోతో పాటు టీజర్‌ను విడుదల చేశారు. అలాగే, ఏంథమ్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో దీని నుంచి ఇప్పుడు 'కోడ్తే' అంటూ సాగే రెండో సింగిల్‌గా స్పెషల్ సాంగ్‌ను వదలబోతున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆడిపాడింది. ఇక, ఈ పాటను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15 ఉదయం 11:08 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే.