For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jai Balayya Mass Anthem: వీరసింహారెడ్డి ఊరమాస్ ట్రీట్.. ఆ ఎలివేషన్స్ చూశారంటే!

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన హవాను చూపిస్తూ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్రాళ్లకు పోటీగా నిలిచేలా వరుసగా సినిమాలు చేస్తున్నారాయన. దీనికితోడు గత ఏడాది అఖండ వంటి బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్న బాలయ్య.. మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. దీంతో మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్విట్టర్ రివ్యూ: నరేష్ మూవీకి టాక్ ఏంటి? సినిమా హిట్టా ఫట్టా?

  అదిరిపోయే కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ జోనర్‌తో తెరకెక్కుతోంది. దీన్ని పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో కొన్ని రియల్ ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తైంది. అతి త్వరలోనే ఈ సినిమా టాకీ పార్టును కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ను మొదలెట్టాలని భావించి తాజాగా 'వీరసింహారెడ్డి' మూవీ నుంచి మొదటి సాంగ్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే విడుదల చేసింది.

  Veera Simha Reddy First Song Jai Balayya Mass Anthem Released

  'వీరసింహారెడ్డి' మూవీ నుంచి తాజాగా 'జై బాలయ్య జైజై బాలయ్య' అంటూ సాంగే మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేయగా.. కరీముల్లా ఆలపించారు. ఇక, ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన 'జై బాలయ్య మాస్ ఏంథమ్' అన్ని వర్గాల శ్రోతలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో రాసిన లిరిక్స్, బాలయ్య కనిపించిన తీరు నందమూరి అభిమానులకు గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంది. దీంతో ఈ పాట తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

  హీరోయిన్ ప్రణిత బెడ్‌రూం పిక్స్ వైరల్: టాప్ తీసేసి.. అతడిపై వాలిపోయి!

  బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుంది.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Veera Simha Reddy Film with Gopichand Malineni. Now This Movie First Song Jai Balayya Mass Anthem Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X