Just In
- 4 hrs ago
ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి
- 5 hrs ago
బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీరెడ్డి.. కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు.. శరవేగంగా ఏర్పాట్లు..
- 5 hrs ago
రొమాంటిక్ లుక్స్‌తో అదరగొట్టిన పూర్ణ.. వైరల్‌గా బ్యాక్‌డోర్ టీజర్
- 5 hrs ago
పొట్టి బట్టల్లో ఫిదా చేసింది.. లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
Don't Miss!
- News
ప్రోటోకాల్ ఉల్లంఘన: ఇంటికి పిలిపించుకుని కరోనా వ్యాక్సిన వేయించుకున్న మంత్రి
- Finance
బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు
- Sports
ఇంగ్లండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి.. పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏంలేదు: ఆర్చర్
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘పైసా మే హీ పరమాత్మా’ అంటోన్న మంచు విష్ణు: కాజల్‌తో కలిసి అలా వస్తున్నాడు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు హీరో మంచు విష్ణు. ఆరంభంలోనే పలు పరాజయాలను చవి చూసిన అతడు.. ఆగకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే 'ఢీ' అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి ఓ మోస్తరు విజయాలను అందుకున్న అతడు.. భారీ హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఇందుకోసం జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా 'మోసగాళ్లు' అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.
మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తోన్న థ్రిల్లర్ మూవీ 'మోసగాళ్లు'. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణు సోదరి పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీచిన్ దర్శకుడు. ఇందులో రుహి సింగ్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ.. బ్లాక్ మనీ నేపథ్యంతో సాగతుందని తెలుస్తోంది. విష్ణు కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇప్పటి వరకు 'మోసగాళ్లు' నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా 'పైసా మే హీ పరమాత్మా' అంటూ సాగే పాటను విడుదల చేశారు. సిరాశ్రీ రాసిన ఈ పాటను లవిత లోబో ఆలపించారు. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు. అర్థవంతంగా సాగిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక, ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది.