Don't Miss!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- News
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు జీవో పై ప్రభుత్వం క్లారిటీ..!!
- Sports
India Playing XI: శుభ్‌మన్, అర్ష్‌దీప్‌పై వేటు.. న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Finance
Pharma Mutual Funds: ఫార్మా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
Waltair Veerayya: రూ.250 బూరతో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ నుంచి హిట్ ఆల్బమ్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇక ఇటీవల మ్యూజిక్ అందించిన వాల్తేరు వీరయ్య సినిమాకు బాగానే మ్యూజిక్ ఇచ్చినప్పటికీ కొంత ట్రోల్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా 250 రూపాయల బూరతో వాల్తేరు వీరయ్య సినిమాలోని ఒక పాటను కంపోజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

పర్ఫెక్ట్ మ్యూజిక్
దేవిశ్రీప్రసాద్ ఎలాంటి సినిమాకైనా సరే పర్ఫెక్ట్ మ్యూజిక్ అంధించగలడు అని గతంలో చాలాసార్లు రుజువయ్యింది. కానీ గత ఐదేళ్ళ కాలంలో దేవి ఇస్తున్న మ్యూజిక్ రొటీన్ గా ఉంటోందని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే సుకుమార్ కాంపౌండ్ లోనే బెస్ట్ మ్యూజిక్ ఇస్తారని కూడా కామెంట్స్ వచ్చాయి. ఇక దేవి మాత్రం అన్ని రకాల సినిమాలకు ఓకే తరహా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

చిరు సినిమా కోసం
ఇక వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు చాలా గ్యాప్ అనంతరం వర్క్ చేస్తుండడంతో ఫ్యాన్స్ లో కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ అయితే పరవాలేదు అనిపించాయి. ముఖ్యంగా బాస్ పార్టీ కూడా ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తోంది.

నెగిటివ్ ట్రోల్స్
ఇక వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన అన్ని పాటలు ఎలా ఉన్నా కూడా ఒక పాట పై మాత్రం దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. పూనకాలు లోడింగ్ అనే పాట సినిమా మొత్తంలో హైలెట్ అవుతుంది అని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ పాటపై నెగిటివ్ ట్రోల్స్ కూడా వచ్చాయి. అసలు ఆ బూర సౌండ్ అస్సలు బాలేదు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

250 రూపాయలతో..
అయితే దేవి శ్రీ ప్రసాద్ ఇటీవల ఆ పాట కోసం వాడిన బూర గురించి కూడా చెప్పాడు. దీనిని కేవలం 250 రూపాయలతో కొనుగోలు చేసినట్లు చెబుతూ ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా చేయాలని ఆలోచనతోనే దీని ఉపయోగించినట్లుగా చెప్పాడు. అయితే దేవిశ్రీప్రసాద్ కొనుగోలు చేసిన ఆ బురకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది మన జాతరలో 25 రూపాయలకు దొరుకుతుంది అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రెమ్యునరేషన్ ఎంతంటే..
ఇక 250 రూపాయలతో దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాను కంపోజ్ చేశాడా అనే విధంగా మరి కొందరు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతే కాకుండా దేవిశ్రీప్రసాద్ వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ టాక్ కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమాకు అతను 4 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాంటిది దేవి శ్రీ ప్రసాద్ ఈ తరహాలో మ్యూజిక్ చేయడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని ఓ వర్గం ఆడియెన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.