ఎనిమిది నిముషాల పాట.. కోటిన్నర ఖర్చు: వైవియస్ చౌదరి
వైవియస్ చౌదరి మాట్లాడుతూ ''పాప్ సంగీతానికి సంబంధించిన 'బెస్ట్ ఆఫ్ ద వరల్డ్' అనే పోటీల్లో హీరో పాల్గొన్నప్పుడు జరిగే ఘట్టమిది. ఆ పోటీలో గెలిచేందుకుపడే తపన, ఎదుర్కొన్న అడ్డంకులు, భరించిన అవమానాలు... అన్నీ ఆ గీతంలో ప్రతిఫలిస్తాయి. ఈ పాట కోసం ప్రేమ్‌రక్షిత్ హీరో, హీరోయిన్స్, డ్యాన్సర్లతో నెల రోజుల నుంచి రిహార్సల్స్ చేయించారు. ఇరవై రోజులు చిత్రించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఒక్క గీతానికే కోటిన్నర రూపాయలు వెచ్చిస్తున్నాం. చక్రి అందించిన ఈ బాణీకి చంద్రబోస్ చక్కటి సాహిత్యం సమకూర్చారు. సాధారణంగా ఒక పల్లవి, మూడు నాలుగు చరణాలుంటాయి. అయితే ఈ పాటలో అయిదు చరణాలుంటాయి. ఈ పాటతో చిత్రీకరణ ముగుస్తుంది''అన్నారు.
అలాగే పాటంటే మూడు, నాలుగు నిమిషాలుంటుంది. అయితే మా కథలోని క్లైమాక్స్ సన్నివేశాన్ని పాటతో రూపొందిస్తున్నాం. ఎనిమిది నిమిషాల నిడివితో సాగే ఈ గీతంలో పలు భావోద్వేగాలు వ్యక్తమవుతాయి. భారీ పోరాటాన్ని చూస్తే కలిగే ఉత్కంఠ దీని ద్వారా అందిస్తామన్నారు వైవీఎస్ చౌదరి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పాటను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సాంగ్ రికార్డింగ్‌కే రెండు నెలలు పట్టింది. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన వ్యక్తి ప్రేమ్క్ష్రిత్. ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఎంతగానో ఉద్వేగానికి గురయ్యాడు. 7, 8 పెద్ద సినిమా అవకాశాలను కూడా వదిలేసుకుని మార్చి 1 నుంచి 25 వరకూ తన బృందంతో కలిసి రిహార్సల్స్ చేశాడు. ఇక పాట చిత్రీకరణ మార్చి 25న మొదలైంది. ఈ నెల 15 వరకూ జరుగుతుంది. 20 రోజులు ఈ పాట చిత్రీకరణ చేస్తున్నామంటే, అది ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు.
ఈ పాట తయారీకి సంగీత దర్శకుడు చక్రి, గేయ రచయిత చంద్రబోస్ విపరీతంగా కష్టపడ్డారు. చక్రి, భార్గవి పిళ్లై ఈ పాట పాడారు. మధ్యలో వచ్చే ర్యాప్ బిట్స్‌ని నోయల్ సియాస్ రచించి పాడారు. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications












