»   » మహేష్ ‘1-నేనొక్కడినే’ నిర్మాతలు సేఫ్, కానీ వాళ్లే..!

మహేష్ ‘1-నేనొక్కడినే’ నిర్మాతలు సేఫ్, కానీ వాళ్లే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం జనవరి 10వ తేదీన విడుదలై బాక్సాఫీసు వద్ద డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన పూర్తి టెక్నికల్ బేస్డ్ ఫిల్మ్ కావడంతో.....మాస్ మసాలా, కామెడీ ఇష్టపడే మన మెజారిటీ జనాలకు ఎక్కలేదు. అయితే సినిమా విలువలు తెలిసిన వాళ్లు మాత్రం హాలీవుడ్ లెవల్లో అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.

కాగా....సినిమా విడుదలై 2 వారాలు పూర్తయింది. మొదటి నుండి సినిమాపై నెగెటివ్ టాక్ నడవటంతో సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కీలకమైన 2 వారాలు గడిచిపోయినా ఇంకా 35 కోట్ల మార్కు కూడా దాటలేదని తెలుస్తోంది.

అయితే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ నిర్మాతలు మాత్రం సేఫ్‌గా బయట పడ్డారు. ఈ చిత్రాన్ని వారు విడుదలకు ముందు ఈరోస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. పైగా శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా కొంత అమౌంట్ దక్కింది నిర్మాతలు. ఓవరాల్‌గా '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా నష్టపోయింది డిస్ట్రిబ్యూటర్లే అనేది ఇన్ సైడ్ టాక్.

'1-నేనొక్కడినే' చిత్రంలో మహేష్ బాబు సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

English summary
Mahesh Babu's 1 - Nenokkadine missed the opportunity to enter the record books by failing to collect revenues on par with the expectations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu