»   » మహేష్ బాబు ‘1’ ఆట మొదలైంది

మహేష్ బాబు ‘1’ ఆట మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా విడుదల చేయడంతో పాటు....సినిమా ప్రమెషన్లలో భాగంగా సినిమాకు సంబంధించిన గేమ్ కూడా తయారు చేయడం ఈ మధ్య ఓ ట్రెండుగా మారింది. ఇప్పటి వరకు బాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన ఈ ట్రెండ్ తాజాగా మహేష్ బాబు '1' సినిమాతో టాలీవుడ్లో కూడా ప్రవేశించింది.

తాజాగా '1' సినిమాకు సంబంధించిన గేమ్ టీజర్ విడుదల చేసారు. ఫుల్ వెర్షన్ గేమ్ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. సినిమా స్టోరీ మాదిరిగానే ఈ గేమ్ కూడా సాగుతుందని తెలుస్తోంది. తొలిసారిగా మహేష్ బాబుకు సంబంధించిన గేమ్ టాలీవుడ్లో విడుదల అవుతుండటం చర్చనీయాంశం అయింది.

‘1: Nenokkadine’ game teaser launched

'1 నేనొక్కడినే' సినిమా వివరాల్లోకి వెళితే...సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్‌గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేసాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.

'1 నేనొక్కడినే' సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు సాధించలేక పోయినా......దర్శకుడు సుకుమార్‌తో మరోసారి కలిసి పని చేయాలని ఆశ పడుతున్నాడు మహేష్ బాబు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా వెల్లడించారు. సో....మహేష్ బాబుకు సుకుమార్ పని తీరు బాగా నచ్చిందన్నమాట.

'సినిమా విడుదలైన తర్వాత మహేష్ నుండి మెసేజ్ వచ్చింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదామని అడిగారు. మహేష్ బాబు లాంటి హీరో మళ్లీ నాతో పని చేయాలని కోరుకోవడం చాలా సంతోషమైన విషయం. నేను కూడా ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి నా వద్ద స్క్రిప్టు రెడీగా లేదు. వీలైనంత త్వరగా ఆయనతో మరో సినిమా చేస్తా' అని సుకుమార్ తెలిపారు.

English summary

 A teaser of Mahesh Babu ‘1: Nenokkadine’ game was launched and the full version is expected to be released soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu