»   » థియేటర్లలొ అభిమానుల మానిటరింగ్, రైతులకు సాయం: విశాల్ ప్లానింగ్ సుపర్ అంటున్న మీడియా

థియేటర్లలొ అభిమానుల మానిటరింగ్, రైతులకు సాయం: విశాల్ ప్లానింగ్ సుపర్ అంటున్న మీడియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నిర్మాతల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైన క్షణం నుంచే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. సినిమా టిక్కెట్‌ ధరలో నిర్మాతల వంతుగా ఒక రూపాయి రైతులకు అందించనున్నామంటూ ప్రకటించేసింది. అంటే తమిళనాడులో ప్రదర్శిత మయ్యే అన్ని సినిమాలకు ఏదో ఒకరోజు ప్రతి టిక్కెట్‌పై ఒక రూపాయిని రైతు నిధికి కేటాయిస్తారు. ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని, తద్వారా ఎన్ని కోట్లు వచ్చినా అంతా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి ఇస్తామని నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా విశాల్‌ చెప్పటం అంతటా ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఆ కారక్రమాన్ని తన సినిమాతోనే మొదలు పెడుతున్నాడు విశాల్...

అభిమానుల్ని బృందాలుగా ఏర్పాటు చేసి

అభిమానుల్ని బృందాలుగా ఏర్పాటు చేసి

అంతే కాదు తాను పైరసీ పై కూడా పోరాడతానని చెప్పినట్టుగానే దాని మీద కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తన అభిమానుల్ని బృందాలుగా ఏర్పాటు చేసి.. ఈ గురువారం విడుదలయ్యే తన కొత్త సినిమా ‘తుప్పారివాలన్' థియేటర్లన్నింటికీ రౌండ్స్‌కు పంపించనున్నాడు విశాల్. వాళ్లు ప్రతి థియేటర్‌నూ మానిటర్ చేయబోతున్నారు. ఎక్కడ పైరసీ జరిగినా విశాల్‌కు సమాచారం ఇస్తారు.

విశాల్ ఫ్యాన్స్ థియేటర్లలో రౌండ్స్ కొడతారట

విశాల్ ఫ్యాన్స్ థియేటర్లలో రౌండ్స్ కొడతారట

తొలి నాలుగైదు రోజుల పాటు ఇలా ప్రతి షోకూ విశాల్ ఫ్యాన్స్ థియేటర్లలో రౌండ్స్ కొడతారట. మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడయ్యాక తమిళనాట రైతుల్ని సినీ పరిశ్రమ తరఫున ఆదుకుంటామని కూడా విశాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రతి సినిమా టికెట్ ద్వారా వచ్చే ఆదాయంలోంచి ఒక రూపాయి రైతు సంక్షేమ నిధికి వెళ్లేలా నిర్ణయం తీసుకున్నాడు విశాల్.

తుప్పరివాలన్

తుప్పరివాలన్

ఇప్పుడు ‘తుప్పారివాలన్' ద్వారా వచ్చే లాభాల్లోంచి కూడా కొంత మొత్తం రైతులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు.ఈ చిత్రానికి విశాల్ సహ నిర్మాత. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన ‘తుప్పారివాలన్' పెద్ద హిట్టవ్వచ్చన్న అంచనాలున్నాయి.

బిల్డింగ్ కోసం నిధులు

బిల్డింగ్ కోసం నిధులు

మరోవైపు నడిగర్ సంఘం కార్యదర్శి అయ్యాక క్రికెట్ మ్యాచ్ నిర్వహించి సంఘం బిల్డింగ్ కోసం నిధులు సేకరించడం.. పేద కళాకారులకు పెన్షన్ పెంచడం.. ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే మొత్తానికి విశాల్ రోజు రోజుకూ తమిళ నాట తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు.

English summary
The latest initiative by Vishal is that, Rs.1 from every ticket bought for his latest film Thupparivaalan, will be donated towards ‘farmer’s welfare’ in Tamil Nadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu