»   » హీరో విక్రమ్ , సమంత డబల్ రోల్...తెలుగులోనూ డిమాండే!

హీరో విక్రమ్ , సమంత డబల్ రోల్...తెలుగులోనూ డిమాండే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో విక్రమ్ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. పైగా సమంత హీరోయిన్. అందులోనూ ద్విపాత్రాభినయం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఉండటం సహజమే. అందకే తమిళంలో తెరకెక్కుతున్న '10 ఎన్రాదుకుల్ల' చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

సినిమాలో తన పాత్ర గురించి సమంత మాట్లాడుతూ... తాను నటిస్తున్న '10 ఎన్రాదుకుల్ల' కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తన పాత్ర భిన్న పార్శాలో సాగుతుందని, సర్వశక్తులుఒడ్టి సినిమాకోసం శ్రమిస్తున్నానని చెప్పింది సమంతా. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో దాదాపు యాభైకోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో విడుదలకానుంది.

సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఛార్మీ సైన్ చేసింది. రెగ్యులర్ గా వచ్చే అన్ని సినిమాల్లోలా చేసే స్పెషల్ సాంగ్ లా కాకుండా కథలో భాగంగా బాగా నాటకీయంగా ఉండే ఈ ఛార్మీ స్పెషల్ సాంగ్ నిడివి 9 నిమిషాలు. అందుకే ఈ పాట కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఈ చిత్ర టీం పూణే దగ్గర లోని ఓ హిల్ ప్రాంతంలో ఓ భారీ సెట్ వేసారు. ఆ సెట్ ని సుమారు 3 కోట్లు ఖర్చు పెట్టి రూపొందించారు. ఈ పాట కోసం ఛార్మి కు 30 లక్షలు పే చేస్తున్నట్లు తెలుస్తోంది.

10 Enradhukulla: Samantha double treat

ఓ కథని జడ్జిమెంట్ చేయటం ఎంత కష్టం...అందులో కోట్ల పెట్టుబడి, కెరీర్ ల మీద గేమ్ గా నడిచే సినిమా నిర్మాణంలో కీలకంగా నడిచే కథ అంటే చాలా చాలా కష్టం. అయితే తన కథని పది క్షణాల్లో హీరో విక్రమ్ ఓకే చేసారని గర్వంగా చెప్తున్నారు విజయ్ మిల్టన్. ఈ చిత్రాన్ని మురగదాస్ నిర్మించటం మరో విశేషం.

సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన విజయ్‌మిల్టన్‌ 'గోలిసోడా'తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో చెన్నైలో సినిమాను తెరకెక్కించి.. భారీఎత్తున కలెక్షన్లు రాబట్టారు. ఏమాత్రం పెద్ద తారాగణం లేకుండా చిన్న పిల్లలతో సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ వూపుతో ఉన్న విజయ్‌మిల్టన్‌ ఇటీవల ఓ కథను విక్రంకు చెప్పి వినిపించారు. కథ చెప్పిన పది క్షణాల్లోనే విక్రం ఓకే చెప్పారట. ఆ కథే ఇప్పుడు '10 ఎండ్రత్తుకుల్ల'గా తెరకెక్కుతోంది.

English summary
As per the latest reports, Samantha will be seen in a double role in her upcoming film 10 Enradhukulla.
Please Wait while comments are loading...