»   » ట్విట్టర్ లో సినిమా ప్రమోషన్ చెయ్యాల్సిన ఖర్మలేదంటున్న స్టార్ హీరో

ట్విట్టర్ లో సినిమా ప్రమోషన్ చెయ్యాల్సిన ఖర్మలేదంటున్న స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్విట్టర్ ని సినిమా ప్రమోషన్ కి వాడేటంత ఖర్మ లేదు అంటూ మండిపడుతున్నాడు బాలీవుడ్ మెగా స్టార్ షారూఖ్ ఖాన్. ఈ బాలీవుడ్ బాద్షా రీసెంట్ గా ఓ నేషనల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ట్వట్టర్ ని నేను నా సినిమాలను ప్రమోట్ చేసుకోవటానికి వాడుతున్నానంటున్నారు. కానీ ట్విట్టర్ లో మహా అయితే ఎనినిది నుంచి పది లక్షలు మంది జనం మాత్రమే చదువుతారు. వారంతా వచ్చి సినిమా చూస్తారని నమ్మకం లేదు. అయినా వారంతా చూసినా నా సినిమా హిట్ కాదు. కాబట్టి ట్విట్టర్ ని నేను కేవలం నా ఫ్యాన్స్ కు నా సినిమా అప్ డేట్స్ ఇవ్వటానికి, వారితో డైరక్ట్ గా డీలింగ్స్ పెట్టుకోవటానకి మాత్రమే ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే సినిమాల గురించే కాకుండా జీవితం గురించి కూడా ట్విట్టర్ లో డిస్కస్ చేసే రోజు వస్తుందని నమ్మకం ఉంది అన్నారు ఉద్వేగంగా. అలాగే కొందరు కావాలని క్రేజీ ప్రశ్నలు, కామెంట్స్ ట్విట్టర్ లో పంపుతూంటారు. అయితే వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. అదే ఏ స్టేజీ మీదో ఏ మీడియా వ్యక్తో అడిగితే కోపం వచ్చినా నవ్వు మొహంతో దాచుకోవాల్సి వస్తుంది. అదే ట్విట్టర్ లో అయితే సైలెంట్ గా ఉంటే చాలు అని సమాధానమిచ్చారు. ఇక ఇప్పుడు తెలుగులో చాలా మంది హీరోలు కూడా తమ రాబోయో సినిమాల గురించి ప్రమోట్ చేసుకోవటానికి ట్విట్టర్,ఫేస్ బుక్ వంటివి ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
"There were comments that 'Oh he only comes on Twitter when he wants to promote his films'. Well with all due respect to everyone, I want to say that 8-10 lakh do not make a film hit." SRK said
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu