»   » జర్నలిస్టులుగా మారిన హాట్ హీరోయిన్స్(ఫోటో ఫీచర్)

జర్నలిస్టులుగా మారిన హాట్ హీరోయిన్స్(ఫోటో ఫీచర్)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పురుషాధిక్యత ఎక్కువగా ఉండే తెలుగు సినిమా పరిశ్రమలో ఏడాదికేడాది హీరోయిజాన్ని అధికంగా ఫోకస్ చేయడం ఆనవాయితీగా మారింది. అయితే ఇందులో కొన్ని కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా వచ్చాయి. ఒక ఏడాదిలో వందలాది సినిమాలు విడుదలవుతున్నా.. కథానాయికలు తమ సత్తా నిరూపించుకునేందుకు చాలా తక్కువ అవకాశాలను మాత్రమే అందిపుచ్చుకుంటున్నారు.

  అనేక చిత్రాల్లో కథానాయికలను గ్లామర్ డాల్స్‌గానే ఉపయోగించుకుంటున్నారు. ఎంతో కష్ట సాధ్యమైన ఇలాంటి అవకాశాలను నేటితరం కథానాయికలు సొంతం చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ టాలీవుడ్‌లో పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇటీవల కొన్ని చిత్రాల్లో కథానాయికలు కథలో ప్రాధాన్యం ఉన్న జర్నలిస్టు పాత్రలను పోషించారు. తమన్నా, నయనతార, పార్వతీ మెల్టన్, తాప్సీ పన్ను, సుమన్ రంగనాథన్ లాంటి కథనాయికలు జర్నలిస్టు పాత్రల ద్వారా తమ సత్తాను నిరూపించుకున్నారు.

  మరికొందరు యువ కథానాయికలు అమలాపాల్, కృతి సనన్, ఛార్మి, హన్సిక మోత్వాని, కావ్య శెట్టిలు త్వరలో విడుదల కానున్న సినిమాల్లో జర్నలిస్టు పాత్రలను పోషిస్తున్నారు. తెలుగు చిత్ర సీమలో జర్నలిస్టు పాత్రను పోషించిన కథానాయికల వివరాలను ఇప్పుడు చూద్దాం..

  కెమెరాతో తమన్నా

  కెమెరాతో తమన్నా


  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథనాయకుడిగా తెరకెక్కిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో కథనాయిక తమన్న జర్నలిస్టు పాత్రను పోషించింది. సమాజంలో మార్పు కోసం ఆ సినిమాలో కెమెరాను పట్టుకున్న తమన్నా.

  కెమెరాతో నయన

  కెమెరాతో నయన


  క్రిష్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా కథనాయకుడిగా రూపుదిద్దుకున్న కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో హీరోకు సహాయకంగా మైనింగ్ అక్రమాలను బయటపెట్టే జర్నలిస్టు పాత్రను నయనతార పోషించింది.

  శ్రీమన్నారాయణలో పార్వతి

  శ్రీమన్నారాయణలో పార్వతి


  బాలకృష్ణ కథనాయకుడిగా రూపొందిన శ్రీమన్నారాయణ చిత్రంలో రిపోర్టర్ స్వప్నిక పాత్రను పార్వతీ మెల్టన్ పోషించింది. పార్వతీ మెల్టన్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

  ఆట ఆరంభంలో తాప్పీ

  ఆట ఆరంభంలో తాప్పీ


  అజిత్ కథనాయకుడిగా నటించిన ఆట ఆరంభం చిత్రంలో తాప్సీ జర్నలిస్టు పాత్రను పోషించింది. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. కాగా ఆమెకు నిజ జీవితంలో జర్నలిస్టు కావాలని ఉందని ఆమె ఇటీవల పేర్కొంది.

  బిర్యానీలో హన్సిక

  బిర్యానీలో హన్సిక


  కార్తీ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న బిర్యానీ చిత్రంలో హన్సిక మోత్వాని ఓ టెలివిజన్ రిపోర్టర్‌గా నటిస్తోంది. తనకు జర్నలిస్టులు అంటే ఎంతో గౌరవమని, ఆ పాత్రను చేయడం వల్ల తనకు వారిపై గల గౌరవం రెట్టింపైనట్లు హన్సిక తెలిపింది.

  కెమెరాతో సమన్ రంగనాథన్

  కెమెరాతో సమన్ రంగనాథన్


  డిసెంబర్ 6న విడుదల కానున్న ఆట ఆరంభం చిత్రంలో సుమన్ రంగనాథన్ జర్నలిస్టుగా నటించింది. తన తొలి సినిమా 20వ శతాబ్ధంలో కూడా ఆమె రిపోర్టర్ పాత్రను పోషించింది.

  వన్‌లో కృతి సనన్

  వన్‌లో కృతి సనన్


  మహేష్ బాబు కథనాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వన్ నేనొక్కడినే చిత్రంలో కృతి సనన్ న్యూస్ కరస్పాండెంట్ పాత్రను పోషిస్తోంది. భారీ అంచనాలతో సిద్ధమవుతున్న ఈ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రత్యేకత ఉందని, అది సినిమాలో చూడాలని కృతి సనన్ చెబుతోంది.

  ప్రతిఘటనలో ఛార్మి

  ప్రతిఘటనలో ఛార్మి


  తమ్మారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిఘటన చిత్రంలో ఛార్మి టీవి కరస్పాండెంట్ పాత్రను పోషిస్తోంది. రాజకీయ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని ఛార్మి ఎంతో ఉత్కంఠ చెబుతోంది.

  కావ్య శెట్టి

  కావ్య శెట్టి


  నవదీప్ కథానాయకుడిగా సాయి గోకుల్ రాంనాథ్ దర్శకత్వంలో థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో జర్నలిస్టు మిత్రా పాత్రలో కావ్య శెట్టి నటిస్తోంది.

  టివి రిపోర్టర్‌గా అమలా పాల్

  టివి రిపోర్టర్‌గా అమలా పాల్


  తన అందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమలాపాల్ జోషియ్ దర్శకత్వంలో రూపొందుతున్న మళయాల చిత్రం రన్ బేబి రన్ చిత్రంలో టీవి రిపోర్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడు మోహన్ లాల్ టెలివిజన్ కెమెరామెన్ పాత్రలో కనిపించనున్నాడు.

  English summary
  Telugu film industry is male dominated and most of the films made every year focus more on heroism. A few female-oriented movies are made in the industry. Out of hundreds of movies produced every year, actresses get very less chance to show their performance. Many a times, they are used as glam dolls.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more