»   » టాలీవుడ్ పై డ్రగ్స్ నీడ: ఆ ముగ్గురు హీరోలూ ఎవరూ అంటూ ఆరా

టాలీవుడ్ పై డ్రగ్స్ నీడ: ఆ ముగ్గురు హీరోలూ ఎవరూ అంటూ ఆరా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పటినుంచో తెలిసిందే అయినా మళ్ళీ ఒక సారి ఏదో ఫార్మాలిటీ కి అన్నట్టు మన టాలీవుడ్ మొత్తం కట్టగట్టు కొని "ఉలిక్కి పడింది" తాజాగా, ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక ఫైట్ మాస్టర్‌కు.. మొత్తం పదిమందికి అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

‘మా' స్పందించింది

‘మా' స్పందించింది

డ్రగ్స్‌ మాఫియాతో సినీ పరిశ్రమకు లింకులు ఉన్నాయనే ఆరోపణలు రాగానే ‘మా' ఈ రోజు స్పందించింది. డ్రగ్స్‌ తీసుకొనే కొందరి వల్ల మొత్తం సినీ పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోందని పలువురు సినీ పరిశ్రమ పెద్దలు అంటున్నారు. అలాంటి వాళ్లకు పరిశ్రమ సహకరించదన్నారు.

నిర్మాత సురేశ్‌బాబు

నిర్మాత సురేశ్‌బాబు

తమకు సామాజిక బాధ్యత ఉందని, డ్రగ్స్‌ వాడుతూ చట్టాన్ని ఎవరు అతిక్రమించినా శిక్షార్హులేనని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు ఈ రోజు మీడియాకు స్పష్టంచేశారు.కెల్విన్, బెన్, నిఖిల్ షెట్టీ అనే ముగ్గురు వ్యక్తులను విచారించిన పోలీసులు సినిమా పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Celebrities and Their Hobbies To Surprise You!
ముగ్గురు హీరోలు

ముగ్గురు హీరోలు

వారి నుంచి సమాచారం రాబట్టి.. పలువురికి నోటీసులు జారీ చేశారు. ఆ రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని, లేదంటే చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొన్నారని తెలుస్తోంది. ముగ్గురు హీరోలు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన వారి ద్వారా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ఆ ముగ్గురు హీరోలు ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ కొన్ని పేర్లు బయటికి వచ్చాయంటున్నారు కానీ ఏదీ అధికారికమైన వార్త మాత్రం కాదు

మరో ఇరవై మంది

మరో ఇరవై మంది

వీరి తర్వాత మరో ఇరవై మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ ఇరవై మంది కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. మొత్తానికి డ్రగ్స్ అంశం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. అయితే ఇక్కడో విషయం గమనించాలి టాలీవుడ్ లో డ్రగ్స్ అన్నది ఎంత కామన్ విషయమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

మీడియా చాలా సార్లే చెప్పింది

మీడియా చాలా సార్లే చెప్పింది

గతం లో హీరో రవితేజ తమ్ముళ్ళు,మరికొందరు సినీ ప్రముకుల పిల్లలూ రెఢ్ హ్యాండెడ్ గానే డ్రగ్స్ తో పట్టుబడ్డారు. పాపం మరీ పెద్ద బ్యాక్ గ్రౌండ్ కాక పోవటం వల్ల రవితేజ తమ్ముళ్ళు మాత్రం కోర్టుకీ, మీడియాకీ ఎక్కారు. అంతెందుకు సిటీ ఔట్ స్కర్టుల్లో జరిగే రేవ్ పార్టీల్లో డ్రగ్స్ దొరికాయన్న వార్తలు పోలీసులు చెప్పకున్నా మీడియా చాలా సార్లే చెప్పింది... ఇప్పుడు ఈ ఘటన ప్రభావం కూడా ఎన్నాళ్ళుంటుందో చూడాలి....

English summary
Excise issued notices to 10 tollywood personalities, including three actors, four directors, on Wednesday in Drug racket case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu