twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు : జియా ఖాన్ గురించి.... 10 తెలియని నిజాలు!

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జియా ఖాన్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 25 ఏళ్ల ఈ సుందరి వాయువ్య ముంబైలోని విలాసవంతమైన జుహు ఏరియాలో గల సాంగర్ సంగీత్ బిల్డింగ్‌లోని తన ఫ్లాట్‌లో అర్ధరాత్రి దాటాక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

    ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె తల్లి, సోదరి ఇంట్లో లేరు. ఒంటరిగా ఉన్న జియా ఖాన్ ఈ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆమె మరణ వార్తను తొలిసారిగా నటి దియా మీర్జా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా అర్ధ రాత్రి దాటక 1.45 గంటలకు అందరికీ తెలిసేలా చేసింది.

    న్యూయార్కులో పుట్టిన జియా ఖాన్ సినీ రంగానికి చెందిన కోర్సులో శిక్షణ పొందింది. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. అమితాబ్ ముఖ్య పాత్రలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వివాదాస్పద చిత్రం 'నిశ్శబ్ద్' ద్వారా బాలీవుడ్ తెరంగ్రేటం చేసింది జియా ఖాన్. ఈ చిత్రంలో ముసలోడి ప్రేమలో పడ్డ యువతిగా ఆమె నటించింది. 2007లో విడుదలైన ఈచిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.

    జియా ఖాన్ గురించి...

    జియా ఖాన్ అసలు పేరు నఫీసా ఖాన్. గతంలో ఆమె తన పేరు గురించి మాట్లాడుతూ...‘16 ఏళ్ల వయసులో నా పేరు జియా గా మార్చుకున్నాను. కానీ నేను తిరిగా నా పాత పేరునే కొనసాగించాలనుకుంటున్నాను. నేను ఎప్పటికీ నఫీసా ఖాన్‌నే. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నఫీసా అనే పిలుస్తుంటారు' అని వెల్లడించింది.

    జియా ఖాన్ - అమీర్ ఖాన్ కనెక్షన్

    బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు జియా ఖాన్ సోదరి అని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై జియా ఖాన్ స్పందిస్తూ...‘ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇదో పనికిమాలిన పుకారు. నిజం చెప్పాలంటే నాకు మా నాన్న గురించి ఎక్కువగా తెలియదు. మా అమ్మను కూడా ఈ విషయమై ఎప్పుడూ అడగలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఓ అమెరికన్' అని బదులిచ్చింది.

    జియా ఖాన్ తండ్రి గురించిన వివరాలు

    ఓ ఇంటర్వ్యూలో జియా ఖాన్ తన తండ్రితో తెగిన బంధం గురించి వెల్లడిస్తూ...‘ఆయన భారత సంతతికి చెందిన ముస్లిం. నాకు మూడు నెలల వయసు ఉన్నప్పుడే ఆయన మా అమ్మను వదిలి వెళ్లిపోయారు. ఆయన పేరు అలీ రిజ్వి ఖాన్. ఆయన న్యూయార్కులో ఎక్కడ నివసిస్తున్నాడో కూడా తెలుసు. ఆయన మాకు దూరంగా ఉంటున్నందుకు బాధ పడటం లేదు. అలాంటప్పుడు మేమెందుకు బాధ పడాలి?' అని వెల్లడించింది.

    జియా ఖాన్ బాయ్ ఫ్రెండ్

    జియా ఖాన్ రహస్య బాయ్ ఫ్రెండ్ కలిగి ఉంది. అతను లండన్లో ఉంటున్నాడు. ‘ఇతన టీనేజర్ల మాదిరిగానే నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు' అని జియా ఖాన్ ఆ మధ్య వెల్లడించింది.

    జియా ఖాన్ గురించిన ఈ విషయం మీకు తెలుసా?

    ‘చాన్స్ పె డాన్స్' చిత్రంలో హీరో షాహిద్ కపూర్ సరసన జియా ఖాన్‌ను ఎంపిక చేసారు. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో జెనీలియాను తీసుకున్నారు.

    జియా ఖాన్ తల్లి రబియా అమిన్

    జియా ఖాన్ తల్లి రబియా అమిన్ ఒకప్పటి బాలీవుడ్ నటి. దుల్హా బిక్తా హై, అంకుష్, లాకెట్, హమ్ రహే నా హమ్, మేరీ జంగ్ లాంటి చిత్రాల్లో నటించారు.

    ముఖేష్ భట్ చిత్రం ‘తుమ్‌సా నహి దేఖా'

    16 ఏళ్ల వయసులోనే ఆమెకు ముఖేష్ భట్ చిత్రం ‘తుమ్‌సా నహి దేఖా' అనే చిత్రంలో తొలి అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో దియా మీర్జాను ఎంపిక చేసారు.

    జియా ఖాన్ ఆత్మహత్య

    జియా ఖాన్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తన బాయ్ ఫ్రెండుక ఫోన్ చేసింది. ఆమె ఎంతో సున్నిత మనస్తత్వం గల మనిషి అని నటుడు కమల్ ఆర్ ఖాన్ వెల్లడించారు.

    జియా ఖాన్ ప్రచారం....

    అంతరించి పోతున్న పులుల పరిరక్షించాలనే కార్యక్రమానికి జియా ఖాన్ ప్రచారం చేసారు.

    బాలీవుడ్‌ను వదిలి వెళ్లాలనుకుంది

    జియా ఖాన్ మరణం తర్వాత ఆమె తల్లి మీడియాతో మాట్లాడుతూ...బాలీవుడ్లో తన కెరీర్ బాగోలేక పోవడంపై ఆమె ఎంతో అప్ సెట్ అయ్యేదని, ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకుందని తెలిపింది.

    English summary
    Bollywood's young, sultry beauty Jiah Khan committed suicide at her residence in Mumbai's Juhu area, on Monday night. As per reports, the 25-year-old actress was found hanging at her flat in Sagar Sangeet Building in the posh Juhu area of northwest Mumbai around midnight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X