»   » 100 కోట్లతో షాక్: బాహుబలి తర్వాతి స్థానంలో జనతా గ్యారేజ్!

100 కోట్లతో షాక్: బాహుబలి తర్వాతి స్థానంలో జనతా గ్యారేజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మోహన్ లాల్ కీలకమైన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్టెనర్ 'జనతా గ్యారేజ్' విడుదలైన రోజు మిక్డ్స్ టాక్ తో పాటు, మిక్డ్స్ రివ్యూలు రుచిచూసింది.

దీంతో తొలి రోజే రకరకాల ప్రచారాలు జరిగాయి. కొరటాల శివ హాట్రిక్ మిస్సయ్యాడని, ఎన్టీఆర్ కు మరోసారి బ్యాడ్ లక్ ఎదురైందంటూ కొందరు కామెంట్ చేయడం కనిపించింది. అయితే వారం తిరిగేలోగా అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి.


ఆ రోజు పరిస్థితి గమనించిన వారెవరైనా... ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా బాహుబలి లాంటి పెద్ద సినిమా తర్వాతి రికార్డులను సొంతం చేసుకుంటుందనే ఆలోచన కూడా అస్సలు చేసి ఉండరు.


తొలి 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం తాజాగా మరో గ్రాండ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్ల షేర్ సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. తాజాగా మరో రికార్డ్ సొంతమైంది. అందుకు సంబంధించిన వివరాలు...


ఎవరూ ఊహించని రికార్డ్

ఎవరూ ఊహించని రికార్డ్


తాజాగా జనతా గ్యారేజ్ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి తర్వాత అత్యంత వేగంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది.


వారం రోజుల్లోనే సాధించింది

వారం రోజుల్లోనే సాధించింది

జనతా గ్యారేజ్ చిత్రం విడుదలైన తొలి 7 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ రికార్డు సాధించడం విశేషం. ఇప్పటి వరకు బాహుబలి సినిమా మాత్రమే 7 రోజుల కంటే ముందే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించింది. ఆ తర్వాతి స్థానం ఇపుడు జనతా గ్యారేజ్ దక్కించుకుంది.


 డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ

డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ


సినిమా విడుదలైన అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురుస్తోంది. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారు. విడుదలైప అన్ని టెర్రిటరీల్లోనూ సినిమాకు లాభాలు ఖాయం అని తేలిపోయింది.


 అమెరికాలో మంచి రెస్పాన్స్

అమెరికాలో మంచి రెస్పాన్స్


ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతోంది. తొలి 5 రోజుల్లోనే రూ. 1.5 మిలియన్ డాలర్ వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ తర్వాత 2 మిలియన్ డాలర్ మార్కను దాటుటుందని అంచనా వేస్తున్నారు.


 మరో ఆప్షన్ కనిపించడం లేదు

మరో ఆప్షన్ కనిపించడం లేదు


ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలేవీ లేక పోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. దీంతో యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ చిత్రం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. వసూళ్లు భారీగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు.


 ప్రేక్షకులకు నచ్చితే అంతే

ప్రేక్షకులకు నచ్చితే అంతే


విమర్శకుల రివ్యూలు ఎలా ఉన్నా అభిమానులు, సాధారణ ప్రేక్షకుల నుండి మాత్రం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అంటే ప్రచారం ట్రేడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.


 కెరీర్లోనే హయ్యెస్ట్ వసూళ్లు

కెరీర్లోనే హయ్యెస్ట్ వసూళ్లు


ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. వసూళ్ల పరంగా జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ సినీ జీవితంలోనే అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోవడం ఖాయం.


 విడుదలైన రోజే ట్వీట్ చేసాడు

విడుదలైన రోజే ట్వీట్ చేసాడు


సినిమా గురించి అన్ని చోట్ల నుండి మంచి రిపోర్టులు వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది అంటూ ఎన్టీఆర్ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ట్వీట్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే.


English summary
Janatha Garage is now the second fastest Telugu movie to rake in a whopping 100 crore gross after Baahubali. The film has managed to attain this feat in just 7 days and that too by braving the initial backlash from the critics and moviegoers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu