»   » గ్రాఫిక్స్ కే వందల కోట్లా...?

గ్రాఫిక్స్ కే వందల కోట్లా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోయిన ఏడాది తాను ఎన్నో అంచ‌నాల‌తో విక్రమ్ హీరో గా తీసిన భారీ బ‌డ్జెట్ మూవీ "ఐ" సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావటంతో రోబో 2ను సూపర్ హిట్ చేసి తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్నాడు శంకర్. రజనీకాంత్ హీరోగా, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ప్రభంజనం రోబోకి సీక్వెల్ గా ప్రస్తుతం రోబో2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకేక్కుతోందన్న ప్రచారం పొందుతున్న ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సంచలనాలు నమోదు చేయడం మొదలుపెట్టింది. సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో "రోబో" లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రోబో 2పై ఇండియ‌న్ సినిమా ట్రేడ్‌వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

దాదాపు రూ.200 కోట్ల పై చిలుకు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కే శంక‌ర్ రూ.100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న‌ ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో 2 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి.

100 Crores Budget for Robo 2.0 Graphic work

రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మరింత భారీగా రూపొందిస్తున్నారు. ఇందు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి రెడీ అయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు..

రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించటం ఒక ప్లస్ కాగా రెహమాన్ రాగాలు మరింత రిచ్ నెస్ యాడ్ చేమనుంది.

English summary
Shankar is spending like 100 crores for the graphics work, for Robo 2.0
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu