»   » 'ప్రేమకావాలి’ కి మరో ఫంక్షన్ కావాలట...!

'ప్రేమకావాలి’ కి మరో ఫంక్షన్ కావాలట...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డబ్బింగ్ ఆర్టిస్టుగానే లక్షల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిన సాయికుమార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ బాగానే సక్సెస్ అయ్యాడు. ఆ తరవ్ాత అనుకోని రీతిలో కన్నడలో అతను నటించిన 'పోలీస్ స్టోరి" ఘన విజయం సాధించడంతో ఆ భాషలో కొన్ని సంవత్సరాల పాటు లీడింగ్ హీరోగా వెలిగిపోయాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో కర్ణాటకలోని ఓ పార్లమెంట్ స్థానానికి బిజెపి తరపున పోటీ చేసిన సాయికుమార్ వెంట్రుక వాసిలో విజయాన్ని మిస్సయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే తన కుమారుడ్ని హీరోగా సక్సెస్ చేయడంలో సాయికుమార్ ఘన విజయం సాధించాడు.

తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేసేందుకు సరైన కథ కోసం ఓపిగ్గా ఎదుడు చూసిన సాయికుమార్..ఈ కథతోపాటు తన కుమారుడ్ని తీసుకు వెళ్లి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ చేతిలో పెట్టడం సత్పలితం ఇచ్చింది. 'ఆది" హీరోగా పరిచయమవుతూ రూపొందిన 'ప్రేమకావాలి" సూపర్ హిట్ అని ఎట్టకేలకు ట్రేడ్ పండిట్స్ డిక్లేర్ చేస్తున్నారు. మాక్స్ ఇండియా బ్యానర్ పై అచ్చిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శతదినోత్సవంను జూన్ 6న హైదరాబాద్ శిల్పకళావేదికలో సినీప్రముఖుల సమక్షంలో ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అచ్చిరెడ్డి మీడియాకి చెప్పారు. అలాగే ఈ సినిమాకు సరైన సాంకేతిక నిపుణులను ఎంపిక చేయించడంలోనూ, సినిమాను బ్రహ్మాడంగా ప్రమోషన్ చేయిండచంలోనూ సాయికుమార్ తీసుకున్న జాగ్రత్తలు చూసిన అతని మిత్రులంతా అతన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

చిత్ర పరిశ్రమలో మా నాన్న (పిజె శర్మ) వేసిన పునాదిని ఆసరా చేసుకుని ఆయన కంటే నేను కొన్ని మెట్లు ఎక్కువ ఎక్కగలిగాను. అలాగే నా కంటే నా కొడుకు ఆది మరిన్ని మెట్లు ఎక్కి, మానాన్న కంటే ,నా కంటే ఎక్కువ పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను" అన్న సాయికుమార్ కలను ఆది నిజం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

English summary
Adi son of Sai Kumar has made his debut with Prema kavali directed by Vijay Bhaskar and produced by K Achireddy under the banner Max India Pvt Ltd has successfully completed 75 days and is going strong towards 100 days and the unit has organized a press meet in this context.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu