»   » బాహుబలి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలోనే అలా!

బాహుబలి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలోనే అలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో గుర్రపు స్వారీ సీన్లు తరచూ కనిపిస్తూనే ఉంటాయి కానీ.... భారీ సంఖ్యలో గుర్రాలను వాడి చిత్రీకరణ జరుపడం చాలా అరుదు. ఇటీవల కాలంలో ‘బాహుబలి' సినిమాలో మాత్రమే వందల సంఖ్యలో గుర్రాలను వాడారు. ఆ సినిమా తర్వాత ఇపుడు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో భారీ సంఖ్యలో గుర్రాలను వాడుతున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో 100 గుర్రాలతో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మాతలు. ‘సర్దార్‌' కోసం చిత్రబృందం ఇప్పుడో భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కించనుంది. ఇందుకోసం వంద గుర్రాలు, బోలెడన్ని ఖరీదైన కార్లు వాడుతున్నారట.


Also Read: నో మూడ్, ఏకాదశి ఇంకా... : 'గబ్బర్ సింగ్'...కొన్ని సీక్రెట్స్


100 horses scene in 'Sardaar Gabbar Singh'

కేవలం గుర్రాలు, కార్లు మాత్రమే కాదు.....వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు, నలభైమంది ప్రధాన తారాగణంతో ఈ యాక్షన్ సీన్ ఉంటుందట. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో సన్నివేశాల చిత్రీకరణ జరిపిన సినిమా ‘బాహుబలి' మాత్రమే. ఇపుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని అంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్ గా ఉంటుందట.


‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 8న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. శరత్‌ కేల్కర్‌, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని, ముఖేష్‌రుషి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌, ఆండ్రూ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Pawan Kalyan is one of the top actors in Telugu cinema and whatever he does has swag. The latest news is that the actor has shot a scene with 1000 men and 100 horses for his upcoming film Sardaar Gabbar Singh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu