1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!
Recommended Video
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రా హాస్పిటల్స్ వారితో చేతులు కలిపి గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడున్నరేళ్లలో దాదాపు 18 క్యాంపులు నిర్వహించి 1000 మంది చిన్నారులకు విజయవంతంగా హార్ట్ ఆపరేషన్స్ పూర్తి చేశారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు భార్య నమ్రత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ పోస్ట్ పెట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్, యూకేకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని, ఒక మంచి పని కోసం తమకు సహాయం చేసిన డాక్టర్ పీవీ రామారావుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
సోషల్ మీడియా ద్వారా...
ఈ సందర్భంగా వైద్య శిబిరాలకు సంబంధించిన ఫోటోలు, శస్త్ర చికిత్స పూర్తయిన చిన్నారుకు సంబంధించిన పిక్స్ నమ్రత తన ఇన్‌స్టా గ్రామ్ పేజీ ద్వారా షేర్ చేశారు. నమ్రత ఈ విషయం వెల్లడించగానే అభిమానులు భారీ సంఖ్యలో రియాక్ట్ అయ్యారు. తమ అభిమాన హీరో ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు.
యూరఫ్ హాలిడే నుంచి తిరిగి వచ్చిన మహేష్ ఫ్యామిలీ
‘మహర్షి' విడుదల తర్వాత దాదాపు 20 రోజుల పాటు యూరఫ్ పర్యటనకు వెళ్లి మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చేవారం నుంచి మహేష్ బాబు తన 26వ సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నారు.
యూరఫ్ ట్రిప్పులో ఎన్నో జ్ఞాపకాలు
ఈసారి యూరఫ్ ట్రిఫ్ మహేష్ బాబుకు ఎంతో స్పెషల్‌గా నిలిచింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌లో భారత్ ఆడుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించారు. క్రికెట్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్‌తో కలిసి ఫోటో దిగో అవకాశం దక్కింది. ఇది నాకు గొప్ప అనుభూతి అని, నేను ఆయనకు పెద్ద అభిమాని, హ్యూజ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.

సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో జాయిన్ కాబోతున్నారు. మహేష్ కెరీర్లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు కనిపించనున్నారు. విజయశాంతి కీలక పాతరలో నటిస్తుండగా... జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న మహేష్ బాబుకు ప్రియురాలి పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











