»   » బాలయ్య 100వ సినిమా కోసం హిస్టారికల్ స్టోరీ!

బాలయ్య 100వ సినిమా కోసం హిస్టారికల్ స్టోరీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాలయ్య నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అందరూ బాలయ్య త్వరలో చేయబోయే 100వ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. బాలయ్య ఈ సినిమా ఎవరితో చేస్తారు? ఎలాంటి కథతో చేస్తారు అనేది హాట్ టాపిక్ అయింది. 100వ సినిమా ఎవరితో చేయాలనే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని బాలయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా బోయపాటి శ్రీనుకే ఉన్నాయని అంటున్నారు.

  అయితే బాలయ్య 100వ సినిమా చేసే అవకాశం కోసం మరికొందరు కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర ఓ హిస్టారికల్ స్ర్కిఫ్ట్ బాలయ్య కోసం సిద్ధం చేసారు. ఈ కథకు బాలయ్య మాత్రమే న్యాయం చేయగలడని భావించిన రవీంద్ర ఇటీల బాలయ్యను కలిసి స్ర్కిఫ్ట్ వినిపించాడట. స్క్రిప్టు విన్న బాలయ్య బావుందని చెప్పాడట. అయితే త్వరలో నా నిర్ణయం వెల్లడిస్తానని అన్నాడట. రవీంద్ర తయారు చేసిన స్క్రిప్టుకు భారీ బడ్జెట్ అవుతుందని, విజువల్ ఎపెక్ట్స్ ప్రాధాన్యం సినిమాలో ఎక్కువగా ఉంటుందిన అంటున్నారు. బాలయ్య ఓకే చెబితే బాహుబలి సినిమాకు పని చేసిన విఎఫ్ఎక్స్ టీంను రంగంలోకి దించాలనుకుంటున్నారట.

   100th movie: Historical script for Balakrishna

  ఇటీవల ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ....100వ సినిమా బోయపాటి దర్శకత్వంలోనే ఉంటుందా? అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ...ప్రస్తుతం ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయి. మార్చికల్లా 100వ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. అప్పటికి బోయపాటి సిద్ధంగా ఉంటే సరే. లేదు నాలుగైదు నెలలు టైం పడుతుంది అంటే అంతకాలం నేను ఆగలేను. వెంటనే వేరొకరితో, ఇంకో సినిమా, పాత్ర చేయాల్సిందే అని బాలయ్య అన్నారు.

  సింగితం శ్రీనివాస్ గారు ‘ఆదిత్య 369' సీక్వెల్ కథతో సహా సిద్ధంగా ఉన్న మాట నిజమే. అయితే ఈ సినిమా విషయంలో నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేయాలా? వద్దా? అనేది సంక్రాంతి పండగ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అన్నారు బాలయ్య.

  100 సినిమా తర్వాత సినిమాలకు దూరం అవుతా, కేవలం రాజకీయాల్లోనే ఉంటాననే ప్రచారంలో నిజం లేదు. లక్షలాది ప్రజలను తృప్తి పరిచే నటనను వదిలి పెట్టాను. ఇంకా చాలా పాత్రలు చేయాలని అభిమానులు కోరుతున్నారు. సినిమాలు చేస్తూనే ప్రజాసేవ కొనసాగిస్తాను అన్నారు బాలయ్య. 100వ సినిమాలో మోక్షజ్ఞను తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అప్పటికీ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను అన్నారు బాలయ్య.

  English summary
  Nandamuri Balakrishna, who is basking in the success of Dictator, has begun preparations for his 100th movie. The actor has been tapping various options and is contemplating to work either in a socio-fantasy or an historical drama. According to our well-placed sources, veteran writer Paruchuri Venkateswara Rao's son Paruchuri Ravindranath has readied a historical script to Balakrishna. Already, Ravi has narrated the script to the Simha actor and is waiting for his response. The film will showcase Balayya in a historical yet powerful avatar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more