»   » అఖిల్ కోసం నాగ్ తపనకు ఇదే నిదర్శనం, ఆ ఒక్క ఫైట్ కోసం 12 కోట్లా..?

అఖిల్ కోసం నాగ్ తపనకు ఇదే నిదర్శనం, ఆ ఒక్క ఫైట్ కోసం 12 కోట్లా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నాగార్జున' తనయుడు 'అఖిల్' మొదటి చిత్రం అనంతరం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయేసరికి చాలా రోజులు విరామం తీసుకుని రెండో సినిమాకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

రా రండోయ్ వేడుక చూద్దాం

రా రండోయ్ వేడుక చూద్దాం

అఖిల్ మొదటి సినిమా అఖిల్ ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో సంవత్సరం పాటు వెయిట్ చేసి రెండో సినిమా విక్రమ్ కే కుమార్ తో సినిమాకి రేడి అయిపోయాడు.తాజాగా రిలీజ్ అయిన నాగ చైతన్య మూవీ 'రా రండోయ్ వేడుక చూద్దాం' మూవీకి టాక్ సాధారణంగా ఉన్నా.. బ్రహ్మండమైన వసూళ్లు రాబట్టింది.

కెరీర్ లోనే బెస్ట్ మూవీగా

కెరీర్ లోనే బెస్ట్ మూవీగా

చైతు కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలవనుంది. తనే దగ్గరుండి అన్నీ చూసుకున్న సినిమా మంచి హిట్ కొట్టడంతో నాగ్ తెగ హ్యాపీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అఖిల్ రెండో సినిమాపై వర్క్ చేస్తున్నారు. అఖిల్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న నాగ్.. ఇప్పటికే ఈ చిత్రానికి 12 కోట్లు వెచ్చించారట. అంటే అప్పుడే అయిపోయిందనుకోకండీ మొత్తం పూర్తయ్యేనాటికి 40-50 వరకూన్ ఖర్చుపెట్తబోతున్నారు.

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో షూటింగ్

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో షూటింగ్

ఆమధ్య హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో షూటింగ్ జరుపుకున్న తొలి మూవీగా నిలిచిందని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు . పట్టాలపై కదులుతున్న మెట్రో ట్రైన్ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ తమ సినిమా షూటింగ్ కి సహకరించిన మెట్రో మేనేజ్మెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు అఖిల్.

12 కోట్ల వరకు ఖర్చు చేశారు

12 కోట్ల వరకు ఖర్చు చేశారు

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుండగా, యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. మెట్రో స్టేషన్ లోను .. ఫుడ్ గోడౌన్ లో ఈ సీన్స్ షూట్ చేసిన ఈ సీక్వెన్స్ 12 కోట్ల వరకు ఖర్చు చేశారనే టాక్ నడుస్తుంది.

భారీ బడ్జెట్ కిందే లెక్క

భారీ బడ్జెట్ కిందే లెక్క

అసలు ఇప్పుడంటే బాహుబలీ, స్పైడర్ లాంటి సినిమాలు వస్తూంటే 40 కోట్లంటే మామూలుగా అనిపించవచ్చుగానీ ఆ ఎమౌంట్ భారీ బడ్జెట్ కిందే లెక్క అందులోనూ మొదటి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న అఖిల్ మార్కెట్ అన్ని కోట్లు రాబట్టే రేంజ్ లో ఉందా అన్న అనుమానం లేకుండా అంత డబ్బు పెట్టడం మామూలు సంగతి కాదు....

ఎక్కడ ఉందో తారక

నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక అఖిల్ సరసన కథానాయికగా మేఘ ఆకాశ్ నటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికి దీనిపై క్లారిటీ లేదు.అజయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ నిర్మించనున్న ఈ చిత్రంకు జున్ను లేదా ఎక్కడ ఎక్కడ ఉందో తారక అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట.

English summary
According to sources Nagarjuna Akkineni, the producer of the film Akhil's next had spent a whopping 12 crore for certain action sequences in the first schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu