»   » 14 కేజీల బంగారు లెహంగా.... భక్తి సినిమాలో ప్రగ్యా కోసం కాస్ట్లీ కాస్ట్యూమ్

14 కేజీల బంగారు లెహంగా.... భక్తి సినిమాలో ప్రగ్యా కోసం కాస్ట్లీ కాస్ట్యూమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున..దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కలయిక అంటే ముఖ్యంగా భక్తిరస ప్రధాన చిత్రాలు గుర్తుకొస్తాయి. వీరి కాంబినేషన్ లో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడి సాయి' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్నాయి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వస్తోంది. అదే 'ఓం నమో వెంకటేశాయ'. ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో 'అక్కినేని నాగార్జున' 'హాథీరామ్‌ బాబా'గా మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు 'కె.రాఘవేంద్రరావు' తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇప్పటికే మెయిన్ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ నటుడు 'సౌరభ్' నటిస్తోండగా, 'అనుష్క' మహా భక్తురాలు 'కృష్ణమ్మ'గా కనిపించనుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఆలయం సెట్టింగ్‌లో షూటింగ్ జరుగుతోంది. లొకేషన్ లోని కొన్ని ఫోటోలను 'రాఘవేంద్రరావు' విడుదల చేశారు. ఫొటోలో 'బ్రహ్మనందం' కూడా ఉండడం బట్టి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా 'అనుష్క', 'ప్రగ్యా జైస్వాల్' నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ తెరకెక్కించిన 'కంచె' చిత్రంలో మెరిసిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఈ భామ నాగార్జున కథానాయ కుడిగా తెరకెక్కుతున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌లో ప్రగ్యా జైస్వాల్ వచ్చి చేరింది. కృష్ణవంశీ చిత్రం 'నక్షత్రం'లో గెస్ట్ రోల్ చేసిన ఈ భామ ఇప్పుడు కె.రాఘవేంద్రరావు భక్తి, ఆధ్యాత్మిక చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'లో చేస్తోంది.

ఇటీవలే ఓం నమో వెంకటేశాయ టీం తో కలిసిన ప్రగ్యాపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. భవానీ పాత్రలో కనిపించనున్న ప్రగ్యాని మరింత అందంగా చూపించడానికి రాఘవేంద్రరావు సన్నద్ధమయ్యారు. ఆమె కోసం ప్రత్యేకంగా బంగరు వర్ణపు గౌనును తయారు చేయించారు. దీని బరువు ఎంతో తెలుసా? ఏకంగా 14 కిలోలు. దర్శకేంద్రుడి సలహాలూ సూచనలతో ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రుక్మిణి ఈ గౌను తయారు చేశారు. అంత బరువున్న గౌనుతో నాట్యం చేయడానికి ప్రగ్యా ఎంత కష్టపడి ఉంటుందో. మన కళ్లు మాత్రం జిగేల్‌మంటున్నాయి.

కీలక పాత్రలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగ్ కు జోడిగా నటిస్తున్న ప్రగ్యా ట్విట్టర్ పేజ్ లో తన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.,,అయితే ఈ ఫస్ట్ లుక్ లో మరో విశేషం కూడా ఉంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న లెహంగాలో కనిపించిన ప్రగ్యా, తన కాస్ట్యూమ్స్ కు సంబంధించిన హింట్ ఒకటి ఇచ్చింది. కామెంట్ లో ఏమీ చెప్పకపోయినా తాను యాడ్ చేసిన ట్యాగ్స్ లో మాత్రం 14 కేజీల బంగారు లెహంగా అనే ట్యాగ్ ఇచ్చింది. దీంతో పోస్టర్ లో ప్రగ్యా వేసుకున్న బంగారు వర్ణ లెహంగా 14 కేజీల బరువు ఉంటుందని తెలుస్తోంది. లోకేషన్, ప్రగ్యా కాస్ట్యూమ్స్, లుక్స్ చూస్తుంటే ఇది దర్శకేంద్రుడి మార్క్ రొమాంటిక్ సాంగ్ అయి ఉంటుందనిపిస్తుంది.

English summary
Pragya Jaiswal is also one lucky actor to get chance to wear an expensive outfit. The gorgeous diva's first look from the devotional film Om Namo Venkatesaya has been unveiled and the actress herself revealed to have worn 14 kgs gold lehenga.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu