twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెం.1 ఎవరంటూ మహేష్ ‘1’ నిర్మాతల పోటీ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఖాళీగా ఉన్న నెం.1 స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో? ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబులలో ఆ స్థానాన్ని ఎవరు సొంతం చేసుకుంటారో? అనే ఒక ఆసక్తికర వాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'చిత్రంతో ఆ సత్తా తనకే ఉందని నిరూపించుకున్నాడు.

    మరో వైపు మహేష్ బాబు కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు...ఆయన సినిమా '1-నేనొక్కడినే' విడుదలకు ముందు భారీ బిజినెస్ చేస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈచిత్రం 'అత్తారింటికి దారేది' రికార్డులను బద్దలు కొడుతుందనే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

    ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.....'1-నేనొక్కడినే' చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సరికొత్త విధానంలో పబ్లిసిటీకి ప్లాన్ చేసింది. మీలో నెం.1 స్టూడెంట్ ఎవరు అంటూ రాష్ట్రంలోని వందలాది పాఠశాలల్లో పోటీలను ప్రారంభించింది. అయితే ఇదంతా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఏర్పాటు చేసిన పోటీ కార్యక్రమమే, దాంటో పాటు మేం నిర్మిస్తున్న '1-నేనొక్కడినే' సినిమాకు కూడా పబ్లిసిటీ కూడా జరుగుతుందని అంటున్నారు నిర్మాతలు.

    1-నేనొక్కడినే

    1-నేనొక్కడినే


    ‘1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు.

    సంక్రాంతి విడుదల

    సంక్రాంతి విడుదల


    సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 1-నేనొక్కడినే చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    నటీనటులు

    నటీనటులు


    సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

    సాంకేతిక విభాగం

    సాంకేతిక విభాగం


    14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

    English summary
    14 Reels Entertainment has a name for their unique and innovative ways of promoting a film. They started their out‐of‐the‐box thinking with “College Dookudu”, duringthe release of the film “Dookudu” and now, they initiated the first time ever, statewide contest for school children.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X