»   » 150 కట్స్...బూతు సినిమాకు సెన్సార్ షాక్!

150 కట్స్...బూతు సినిమాకు సెన్సార్ షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తుషార్ కపూర్, అఫ్తాబ్ శివ్ దాసని, మందన కరిమి ప్రధాన పాత్రలుగా ఉమేష్ గాడ్గె దర్శకత్వంలో ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించిన ఈ సెక్స్ కామెడీ సినిమా ‘క్యా కూల్ హై హమ్ 3'. చిత్రంలో గౌహర్‌ఖాన్‌ తో స్పెషల్ గా ఐటం సాంగ్ చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 150 cuts for Kya Kool Hain Hum 3

ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. సినిమా చూసిన అనంతరం సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి 150 కట్స్ వేయాలని నిర్ణయించారట. సినిమా మొత్తం సెక్స్, డబుల్ మీనింగ్ డైలాగులు, జుగుప్స కలిగించే సీన్లు ఉండటంతో సెన్సార్ బోర్డు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమా మొత్తం సెక్స్ కామెడీ ప్రధానంగా తెరకెక్కింది. అసలు సిసలైన సీన్లన్నంటికీ సెన్సార్ కత్తెర వేయాలని నిర్ణయించడంతో దర్శక నిర్మాతలకు ఏం చేయాలో తోచడం లేదని టాక్. అన్ని కట్స్ అయితే సినిమా షేప్ మారిపోతుందని అంటున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాలో సెక్స్ కంటెంట్ తారా స్థాయిలో ఉందని స్పష్టం చేసింది. ఈ సినిమా చూసేందుకు శృంగార ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో సెన్సార్ బోర్డు షాకివ్వడంతో అంతా డీలా పడ్డారు.

పోర్న్ సైట్లలో కూడా...

మరో ప్రక్క "క్యా కూల్ హై హమ్ 3" ట్రైలర్ ను "పోర్న్ సైట్స్"లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇదేమిటని అడిగితే.. "ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న తుషార్ కపూర్ మరియు అఫ్తాబ్ లు పోర్న్ స్టార్లుగా నటిస్తున్నారు. అందువల్ల మా సినిమా ట్రైలర్ ను "పోర్న్ సైట్స్"లో విడుదల చేయడమే సమంజసం అనిపించింది" అంటూ ఆ మధ్య ఓ సందర్భంలో సమాధానం చెప్పారు దర్శకుడు ఉమేష్.

English summary
CBFC recommends 150 cuts in Kya Kool Hain Hum 3 for 'A' certificate.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu