»   » చిత్ర పరిశ్రమకు అందరి బంధువు.. దాసరికి 18 వేల అభిమాన సంఘాలు

చిత్ర పరిశ్రమకు అందరి బంధువు.. దాసరికి 18 వేల అభిమాన సంఘాలు

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఇకలేరు. దర్శక దిగ్గజమైన దాసరి మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. పాలకొల్లులో జన్మించిన దాసరికి చిన్నతనం నుంచే కళారంగంపై ప్రత్యేక ఆసక్తి ఉంది. కళాశాలలో చదివే రోజుల్లోనే దాసరి అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవారు. అనతి కాలంలోనే ప్రతిభావంతుడైన రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో దాసరి పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

18 thousand Associations for Dasari Narayana Rao

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాల్లో ప్రధానంగా మహిళా సమస్యలు ఉండేవి. దాసరి తీసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశానికి బాటలు వేశాయి. మామగారు, సూరిగాడు, ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

English summary
Renowed film personality Dasari Narayana Rao died with Heart arrest. He has attraction towards art and drama from his childhood. His movies become sensational in film Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu