»   » ‘బాహుబలి’ షూటింగ్ కోసం 190 వర్కింగ్ డేస్ లాక్!

‘బాహుబలి’ షూటింగ్ కోసం 190 వర్కింగ్ డేస్ లాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి-ది బిగినింగ్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో బాహుబలి-2 మొదలు కాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ షెడ్యూల్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. షూటింగ్ మొత్తం 190 రోజుల్లో పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

యూనిట్ సభ్యులు ప్రతి షెడ్యూల్ కు మధ్య 10 నుండి 20 రోజులు బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ప్రభాస్ మొత్తం 10 నెలల పాటు ఈ షూటింగులో గడపనున్నాడు. 2016 సంవత్సరం మొత్తం ‘బాహుబలి-2' షూటింగులో గడిచిపోనున్న నేపథ్యంలో ప్రభాస్ ఇతర సినిమాలేవీ కమిట్ కావడం లేదు. జులై 2016లో ప్రభాస్ కొత్త మూవీ ప్రారంభం అవుతుందనే వార్తలు వచ్చినప్పటికీ అదంతా అవాస్తవం అంటున్నారు బాహుబలి యూనిట్ సభ్యులు.


190 Working Days Locked For Baahubali 2

‘బాహుబలి-1' భారీ విజయం సాధించడంతో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈనేపథ్యంలో రాజమౌళి రెండో పార్టును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాహుబలి 1 కంటే రెండో పార్టు కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారట. సెకండ్ పార్టులో కొన్ని అడిషనల్ క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం. సౌత్ తో పాటు బాలీవుడ్ నుండి పలువురు స్టార్స్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.


‘బాహుబలి-2'ను 2016లో విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీం గతంలో ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి వచ్చే ఏడాది సినిమా రావడం లేదని తేలి పోయింది. ‘బాహుబలి-2' విడుదల సాధ్యమయ్యేది కేవలం 2017లోనే అంటున్నారు ఆచిత్ర యూనిట్ సభ్యులు.


190 Working Days Locked For Baahubali 2

వాస్తవానికి ‘బాహుబలి-2' షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉంది. అయితే కొన్ని మార్పుల కారణంగా డిసెంబర్ లాస్ట్ వీక్ లేదా జనవరి మొదటి వారంలో గానీ షూటింగ్ మొదలు కాబోతోంది. భారీ సినిమా కావడం, గ్రాఫిక్స్ ఆధారమైన సినిమా కావడంతో షూటింగ్ పూర్తయి, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తయి విడుదల సిద్ధం అయ్యే సరికి 2016 గడిచి పోతుందని అంచనా వేస్తున్నారు.


బాహుబలి సాంకేతిక బృందంలో కొత్త సభ్యుడు చేరారు. ఆయన మరెవరో కాదు రాజమౌళి మగధీర, ఈగ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ అందించిన ఆర్‌.సి.కమలాకణ్ణన్‌. శ్రీనివాస్‌ మోహన్‌ స్థానంలో కమలాకణ్ణన్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తారని చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది.

English summary
Film Nagar source said that, Exactly 190 working days have been allotted for the Baahubali-2 shooting. Even if the unit takes short breaks in between for every 10 or 20 days schedule, Prabhas have to be present for nearly 10 months for the movie.
Please Wait while comments are loading...