»   » హీరో సూర్య రిలీజ్ చేసిన "c/o సూర్య" ఫస్ట్ లుక్ ఇదే...

హీరో సూర్య రిలీజ్ చేసిన "c/o సూర్య" ఫస్ట్ లుక్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సందీప్ కిషన్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం "c/o సూర్య". ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌ని ప్ర‌ముఖ తమిళ హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

నా పేరు శివ ఫేమ్ సుసీంథరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈచిత్రానికి క‌బాలి చిత్రంలో యాక్ష‌న్ తో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన అంబు, అరివు లు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేశారు. "గజరాజు, జిల్లా, రైల్" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన త‌మిళ సంగీత ద‌ర్శ‌క‌డు డి.ఇమ్మాన్ ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నారు.


c/o సూర్య

ఈ సందర్భంగా సహ-నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. "నా పేరు శివ చిత్రంతో ద‌ర్శ‌కుడి గా చాలా మంచి పేరు సంపాయించిన ద‌ర్శ‌కుడు సుసీంథ‌ర‌న్‌ దర్శకత్వంలో "నా పేరు శివ" తరహాలో తెరకెక్కనున్న మా చిత్రం టైటిల్ "c/o సూర్య" ని, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని ప్ర‌ముఖ హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌ల చేశామన్నారు.


యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

దర్శకులు సుసీంధరన్ అద్భుతమైన కథను రెడీ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్ష‌న్ పార్ట్ ని క‌బాలి చిత్రానికి ప‌నిచేసిన అంబు, అరియులు చేస్తున్నారు. ఈ చిత్రంలో మా హీరో సందీప్ కిషన్ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నారు. సందీప్ త‌ప్ప‌కుండా కొత్త కేర‌క్ట‌రైజేష‌న్ తో అంద‌రిని ఆక‌ట్టుకుంటాడు. మెహ‌రిన్ పాత్ర చాలా అందంగా కనిపిస్తుందని నిర్మాత తెలిపారు.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. జులై లో చిత్రాన్ని విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన డి.ఇమ్మాన్ గారిని తెలుగు తెరకు ప‌రిచ‌యం చేశాము. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందని నిర్మాత తెలిపారు.


నటీనటులు, తెర వెనక

నటీనటులు, తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్, ఎడిటర్: కాశీవిశ్వనాధం, పాటలు: రామజోగయ్య శాస్త్రి-శ్రీమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.సి, సహ-నిర్మాత: రాజేష్ దండా, సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంధరన్!English summary
1st look of "C/o Surya" launched by Actor Suriya today. Krishna Gaadi Veera Prema Gaadha fame Mehreen Kaur Phirzada is playing love interest of Sundeep Kishan and the upcoming film will also mark Mehreen’s foray in Kollywood. It is the first time when Suseenthiran has paired up with these two young stars. Chakri Chigurupati is bankrolling the film under the banner of Lakshmi Narasimha Entertainments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu