For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2.0....లేడీ రోబోగా అమీ జాక్సన్ ఫస్ట్ లుక్ అదుర్స్!

  By Bojja Kumar
  |

  రజనీకాంత్ హీరో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రస్తుతం '2.0' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రజనీ-శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' చిత్రానికి ఇది సీక్వెల్ తరహాలో ఉంటుంది. అప్పట్లో వచ్చిన రోబో సినిమాలో కేవలం మగ రోబో మాత్రమే ఉంది. అయితే ఈ సీక్వెల్‌లో ఆడ రోబో కూడా అభిమానులను అలరించబోతోంది.

  ఈ చిత్రంలో ఆడ రోబోగా అమీ జాక్సన్ నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. ఈ ప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు... అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్ ఉండటం గమనార్హం.

  రెండు రోబోలు ప్రేమించుకుంటాయా?

  రెండు రోబోలు ప్రేమించుకుంటాయా?

  2.0 సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ ఈ రోజు ప్రారంభం అయింది అంటూ.... దర్శకుడు శంకర్ తన సోషల్ మీడియాలో అమీ జాక్సన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి సినిమాలో రజనీ రోబో, అమీ జాక్సన్ రోబో క్యారెక్టర్ల మధ్య రొమాంటిక్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది.

  సొంతగా ఆలోచించే రోబో, మనసు కూడా...

  సొంతగా ఆలోచించే రోబో, మనసు కూడా...

  గతంలో వచ్చిన శంకర్ రోబో సినిమాలో.... రోబోకు సొంతగా ఆలోచించే తెలివితో పాటు మనసుతో ఆలోచించే విధంగా ఫ్రోగ్రామ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. అదే కాన్సెప్టుతో ఈ సినిమాలో రోబోలు మనుషులపై పోరాడుతాయని సమాచారం.

  లైకా ప్రొడక్షన్స్

  లైకా ప్రొడక్షన్స్

  2.0 సినిమా ఆడియో వేడుక ఈనెల 27న దుబాయ్‌లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. వచ్చే జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  భారీగా ఖర్చు...

  భారీగా ఖర్చు...

  రోబో 2.0 ఆడియో వేడుక కోసం డబ్బులు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. దుబాయ్ లో జరిగే ఈవెంటును రూ. 12 కోట్ల ఖర్చుతో నిర్వహించబోతున్నట్లు సమాచారం. గతేడాది సినిమా లాంచింగ్ సమయంలో కూడా రూ. 6 కోట్లు ఖర్చు పెట్టి వేడుక భారీగా నిర్వహించారు. ఇంత భారీ ఎత్తున నిర్వహించడం వెనక భారీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయని తెలుస్తోంది.

  ఇదే హయ్యెస్ట్ బడ్జెట్

  దాదాపు రూ. 400 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇండియాలో బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ఇదే హై బడ్జెట్ సినిమా అని అంటున్నారు. అయితే ప్రమోషన్స్ కు పెట్టే ఖర్చు, ఇతరత్రా అన్నీ కలిపితే ఈ చిత్రం బడ్జెట్ విషయంలో బాహుబలిని మించి పోతుందని అంటున్నారు.

  ఇండియన్ బిగ్ 3డి ఫిల్మ్

  ఇండియన్ బిగ్ 3డి ఫిల్మ్

  3డి ఎఫెక్టులతో ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. ఇండియాలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 3డి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి త్రీడీ మేకింగ్ వీడియోను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

  చాలా ఎగ్జైట్ అవుతున్న రజనీకాంత్

  చాలా ఎగ్జైట్ అవుతున్న రజనీకాంత్

  రజనీకాంత్ మాట్లాడుతూ... శంకర్ 3డిని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టు రాశారు. ఫస్ట్ 3డి షాట్ నేను చిన్న స్క్రీన్ లో చూశాను. నేను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. అంతలా అది నన్ను మెస్మరైజ్ చేసింది. నేను ఆడియన్స్ రియాక్షన్ చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఇది ఒక పెద్ద హాలీవుడ్ 3డి మూవీ స్థాయిలో ఉంటుంది అన్నారు.

  విలన్ పాత్రలో అక్షయ్ కుమార్

  విలన్ పాత్రలో అక్షయ్ కుమార్

  ఈ చిత్రంలో విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఆయన ద్వారా బాలీవుడ్ మార్కెట్ ను గ్రాబ్ చేయాలనేది నిర్మాతల ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. 3డిలో పని చేయడం నేను అనుకున్న దానికంటే చాలా కష్టం. ప్రతి షాట్ లో సెటప్ నుండి అన్నీ పర్ ఫెక్టుగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి షాట్ తర్వాత నేను వెనక్కి వెళ్లి, డైరెక్టర్ తో పాటు కూర్చుని హైటెక్ 3డి గ్లాసులతో షాట్ చెక్ చేశాను. ఇండియాలో 3డికి అయితే ఇది అరుదైన అనుభవం. ఆ ఎగ్జైట్మెంట్ పది రెట్లు ఉంటుంది అన్నారు.

  English summary
  Shankar’s ambitiously mounted 2.o releases only around Pongal 2018, but the chase to its big release has begun in right earnest. The first look poster of one of its main characters, played by Amy Jackson, was unveiled by the actor and the director on Twitter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X