Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యూఎస్‌లో షాకింగ్‌గా 2.O మూవీ కలెక్షన్లు.. బాహుబలి2కి బహుదూరంలో..
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన 2.O మూవీ ఓవర్సీస్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. యూఎస్ మార్కెట్‌లో వారాంతంలో దుమ్మురేపడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్ర కలెక్షన్లు వారాంతం తర్వాత భారీగా క్షీణించినట్టు తెలుస్తున్నది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2.O మూవీ సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

నాలుగు రోజుల్లో
2.O మూవీ చిత్రం మంగళవారంతో యూఎస్ మార్కెట్‌లో 4 మిలియన్ల క్లబ్‌లో చేరింది. తొలి రోజు ఈ చిత్రం ప్రీమియర్లతో కలిపి 982,929 డాలర్లు, రెండో రోజున 727,038 డాలర్లు, 1,299,854 డాలర్లు, 743,846 డాలర్లు సాధించింది. మొత్తంగా నాలుగు రోజుల్లో 3,753,582 డాలర్లు అంటే రూ.26.4 కోట్లు సాధించింది.

వీకెండ్ తర్వాత క్షీణిస్తున్న వసూళ్లు
2.O మూవీ వారాంతం లోపు భారీగా వసూళ్లు సాధించినప్పటికీ సోమవారం నుంచి భారీగా కలెక్షన్లు పడిపోయాయాని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం వర్కింగ్ డే కావడంతో 130,116 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. మంగళవారం రోజు కలెక్షన్లతో కలుపుకొని 3,887,663 డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
చైనా బాక్సాఫీస్‌పై 2.O మూవీ దండయాత్ర.. అమీర్, బాహుబలి రికార్డుపై గురి

బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్లు
ఇక మంగళవారం తర్వాత కూడా 2.O మూవీ కలెక్షన్లలో పెద్దగా వృద్ధి కనిపించకపోవచ్చనే మాట వినిపిస్తున్నాయి. 2.O మూవీ వసూళ్లు చూసుకొంటే బాహుబలి2 చిత్రానికి చాలా దూరంగా ఉంది. బాహుబలి2 సాధించిన కలెక్షన్లను 2.O మూవీ ఆరు రోజుల్లో కూడా కలెక్ట్ చేయలేకపోవడం గమనార్హం.

రూ.600 కోట్లతో
దేశ సినీ చరిత్రలోనే గతంలో ఎన్నడూలేని విధంగా 2.O మూవీ సుమారు రూ.600 కోట్లతో రూపొందింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. అమీ జాక్సన్, ఆదిల్ హుస్సేన్, సుధాంశు పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.