»   » ఐటం గర్ల్ ఇంట్లో నీలి చిత్రాల భాగోతం...అరెస్ట్

ఐటం గర్ల్ ఇంట్లో నీలి చిత్రాల భాగోతం...అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబయి: ఓషివారాలోని మిస్తీ ముఖర్జీ అనే సినీనటి,ఐటం గర్ల్ నివసించే ఫ్లాటుపై పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున నీలి చిత్రాల సీడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో మీరా టవర్‌లోని 1502 ఫ్లాటుపై దాడి చేశారు. ఆ ఫ్లాటులో మిస్తీతోపాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు నివాసం ఉంటున్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు.

  ఒకే గదిలో మిస్తీ ముఖర్జీతో పాటు ఆమె స్నేహితుడు రాకేశ్‌ కొఠారియా ఉండగా కనుగొన్నారు. కొఠారియా ఢిల్లీకి చెందిన వాడనీ, ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. 35 ఏళ్ల మిస్తీ 2012లో విడుదలైన 'లైఫ్‌ కీ తూ లగ్‌ గయీ' చిత్రంలో తొలిసారి నటించారు. పోలీసులు సోదాలు నిర్వహించగా 25,000 నీలిచిత్రాల సీడీలు కనిపించాయి. ఈ ఫ్లాటులో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు జరిపారు. ఫ్లాటు వివరాలపై దృష్టిసారించిన పోలీసులు.. ఆ ఫ్లాటు 'బెస్ట్‌' జీఎం ఓ.పి.గుప్తాదిగా గుర్తించారు.

  Misti Mukherjee

  దీంతో పోలీసులు ముఖర్జీని వివరణ కోరగా ఏడేళ్ల కిందట ముఖర్జీ కుటుంబానికి నెలకు రూ.80,000కు అద్దెకు ఇచ్చినట్లు వివరించారు. అయితే ఆ ఇంట్లో జరుగుతున్న విషయాలు తనకేమీ తెలియవన్నారు. దక్షిణాది నుంచి నీలి చిత్రాల సీడీలను కొనుగోలు చేసి వీటిని కాపీ చేసి ముంబయి, థానేల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వ్యభిచార కార్యకలాపాలపై స్పందిస్తూ మిస్తీ తండ్రి చంద్రకాంత్‌ ముఖర్జీ (62) ఖండించారు. తాను మధుమేహ వ్యాధిగ్రస్తుడినని, లైంగిక వాంఛలు లేవన్నారు.

  నీలి చిత్రాలను తిలకించేందుకు ఈ సీడీలన్నింటినీ తానే స్వయంగా కొనుగోలు చేసినట్లు వివరించారు. మిస్తీతోపాటు గదిలో ఉన్న కొఠారియా తమ బంధువు అని వివరించారు. నిందితుల ఫ్లాటు నుంచి నీలిచిత్రాల సీడీలు, ల్యాప్‌టాప్‌, హార్డ్‌ డిస్క్‌, సీడీ రైటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  నటి మిస్తీతో పాటు ఆమె తల్లి, తండ్రి చంద్రకాంత్‌ ముఖర్జీ, అతని కుమారుడు సమర్థ్‌ (30)లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ తదితరాలను పరిశీలించి ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తల్లీ, కుమార్తెలపైనా కేసులు నమోదు చేస్తామని ఓషివారా సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాసిర్‌ పఠాన్‌ తెలిపారు.

  English summary
  With the arrest of a father-son duo, the city police today claimed to have busted a pornographic CD and DVD supply racket. The accused, Chandrakant Mukherjee (58) and his son Samrat Mukherjee (30) - who are father and brother of bengali actress Misti Mukherjee - were arrested from an apartment in a high-profile residential complex in Lokhandwala in suburban Oshiwara locality, police said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more