For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2012 వాయిదా సినిమాలు...రిజల్ట్ లు(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ 2012 కి వాయిదాల సంవత్సరంగా మార్చేసింది. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్రాలు విడుదల తేదీలు ప్రకటించి,మార్చటం జరగింది. బిజినెస్ కాకపోవటం, ఫైనాన్సియర్ల సమస్యలు, ధియోటర్ సర్దుబాట్లు వంటి రకరకాల సమస్యులు పెద్ద సినిమాలను ఫోస్ట్ ఫోన్ చేసుకునే దిసగా నడిపించాయి. విడుదల తేదీ ప్రకటించి... వాయిదా వేసుకోవడం ఈ యేడాది ఎక్కువైంది. చిన్న సినిమాలే కాదు.. స్టార్ హీరోల చిత్రాలకూ ఈ సమస్య తప్పడం లేదు.

  బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకొన్నారు. కుదర్లేదు. జూన్‌ 1న తెర మీదకు వచ్చింది. ఈ వాయిదా ఎఫెక్టు రిజల్టుపై పడింది. సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఆ తర్వాత బాలకృష్ణ చేసిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', 'శ్రీమన్నారాయణ' చిత్రాలూ ప్రణాళిక ప్రకారం తెరపైకి రాలేదు.

  ఇక రిలీజ్ డేట్ ముందు చెప్పి సినిమా ప్రారంభించి చెప్పిన సమయానికి విడుదల చేసే దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కి గుర్తింపు ఉంది. ఆయన తీసిన 'దేవుడు చేసిన మనుషులు' తెరపైకి రావడంలో జాప్యం చోటు చేసుకొంది. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందింది.

  అల్లు అర్జున్ 'జులాయి'కీ వాయిదా గండం తప్పలేదు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం రిలీజ్ డేట్స్ వాయిదా పడి చివరకు విడుదలై చెప్పుకోదగ్గ విజయమే సాధించింది.

  రీసెంట్ గా లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన 'రెబల్‌'కీ విడుదల తేదీలు ఎన్నో మారాయి. చివరకు భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ గా చిత్రం నమోదు అయ్యింది.

  శేఖర్‌ కమ్ముల రూపొందించిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'కీ విడుదల తేదీలు చాలా మారాయి. అమల,అంజలా జవేరీ,శ్రియ వంటి మాజీ హీరోయిన్స్ తో,అంతా కొత్త వాళ్లను ముందు పెట్టుకుని తీసిన ఈ చిత్రం ఎవరినీ మురిపించలేకపోయింది. భాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.

  రాజమౌళి 'ఈగ'కి కూడా మొదట ఓ విడుదల తేదీని నిర్ణయించుకున్నారు. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు సకాలంలో పూర్తి కావు అనే విషయం తెలియగానే ఆయన ట్విట్టర్‌ ద్వారా వాయిదా వివరాల్ని తెలిపి మరో తేదీని ప్రకటించారు. ఆ సమయానికి చిత్రాన్ని తీసుకొచ్చారు. సినిమా విజువల్ వండర్ గా పేరు తెచ్చుకుని నిర్మాత సురేష్ బాబుకి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

  దసరాకి వస్తుందని భావించిన 'డమరుకం' విడుదలలోనూ గందరగోళం నెలకొంది. దీనికి కొన్ని తేదీలు మారాయి. దీపావళి సందర్భంగా ఈ నెల 9న తీసుకొస్తామని తెలిపారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేసి 10న వస్తుందని ప్రకటించారు. 'డమరుకం' వల్ల చిన్న సినిమాలు రోజు రోజుకీ వెనక్కి వెళ్తున్నాయి. 'రొటీన్‌ లవ్‌స్టోరీ', 'గోల గోల', 'బస్‌స్టాప్‌', 'దేవరాయ'లాంటి సినిమాల తేదీలు 'డమరుకం' మీద ఆధారపడి ఉన్నాయి. ఈ సినిమా వస్తుందనే కారణంతోనే 'కృష్ణం వందే జగద్గురుమ్‌'నీ వాయిదా వేశారు.

  రానా,క్రిష్ ల తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌' కూడా చాలా సార్లు విడుదల తేదీలు మారాయి. చివరకు అంతా నవంబర్ 9కి ఫిక్స్ అయ్యిరు. అయితే నవంబర్ 30కి ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేశారు.

  ఈ యేడాది చాలా సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకొంటూ వచ్చాయి. ఎక్కువగా చిన్న సినిమాలు వాయిదా పడుతూంటాయి. అలాంటిది ఈ సారి పెద్ద సినిమాలే వాయిదా పడటం పరిశ్రమలో పెద్దలని ఆలోచనలో పడేసింది. ఈ మార్పుచేర్పుల వల్ల చిన్న చిత్రాలు నలిగిపోతున్నాయి. తమ చిత్రం తెరపైకి వచ్చే సమయంలో పెద్ద చిత్రం ఏదీ లేకుండా చూసుకొంటున్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో 2012లోని వాయిదాల పర్వాన్ని పరికిస్తే...

  English summary
  Many film in tollywood Postponed in 2012. It's effected in Small films release dates. 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X