»   » 2013లో టాలీవుడ్ ఫస్ట్ రిలీజ్ ఎవరిది?

2013లో టాలీవుడ్ ఫస్ట్ రిలీజ్ ఎవరిది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 2012 సంవత్సరం అలా వెళ్లి పోయి 2013వ సంవత్సరం రానే వచ్చింది. నిన్న మొన్నటి వరకు గత సంవత్సరం టాప్ ఎవరు, టాప్ సినిమా ఏది లాంటి చర్చ టాలీవుడ్లో సాగింది. తాజాగా ఈ సంవత్సరం టాలీవుడ్లో రిబ్బన్ కటింగ్ చేసేది ఎవరు? తొలి హిట్ ఎవరిది? అనే చర్చ మొదలైంది.

ప్రతి సంవత్సరం స్టార్ హీరోల్లో ఎవరో ఒకరు తమ సినిమాలను కొత్త సంవత్సరం వేళ అందరికంటే ముందుగా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యే వారు. అయితే ఈ సారి మాత్రం వారందరినీ వెనక్కి నెట్టేసి హీరో శ్రీకాంత్ రంగంలోకి దూకాడు. ఈ సంవత్సరం తొలి రీలీజ్ శ్రీకాంత్ నటిస్తున్న 'సేవకుడు' సినిమానే. రేపు(జనవరి 4)న ఈ సినిమా విడుదల కాబోతోంది.

విశాఖ టాకీస్ నట్టికుమార్ పంపిణీ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఛార్మి. జనవరి 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ - నేటి సమాజం.. మనిషి స్వభావం.. రాజకీయం.. రాజకీయ అవినీతి.. అన్నీ మారాలని చెప్పే చిత్రమిది అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ- పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రం ఇదని తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్రలో శ్రీ వెంకటరమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ముత్తినేని సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కథ విషయానికొస్తే... హెడ్ కానిస్టేబుల్ అయిన ఒక తండ్రి అన్యాయాలతో నిండిన వ్యవస్థను మార్చాలనుకుంటాడు. అతని వల్ల కాని పనిని తన కుమారునితో చేయించాలనుకుంటాడు. ఐతే పోలీస్ వ్యవస్థ మారితేనే గానీ సమాజం మారదంటాడు హీరో సూర్యం. అన్యాయం, అవినీతిపై అతను ఏ విధంగా పోరాడాడనేదే కథ. నిర్మాణ సారథ్యం: సోమ విజయ ప్రకాష్, రచన: స్వామీజీ - విజయ్, సంగీతం: శ్రీకాంత్ దేవా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: లగడపాటి శ్రీనివాసరావు, కథనం, దర్శకత్వం: వి. సముద్ర.'

English summary

 Srikanth-Charmi starrer ‘Sevakudu’ will be the first Tollywood release for the year 2013. The film has been directed by V. Samudra. Muttineni Satya Narayana is the producer.
Please Wait while comments are loading...