»   » 2016 కాటేసింది, 2017 మీదే ఆశ.... అంటూ పవన్ కళ్యాణ్ న్యూ ఇయర్ విషెస్

2016 కాటేసింది, 2017 మీదే ఆశ.... అంటూ పవన్ కళ్యాణ్ న్యూ ఇయర్ విషెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర విషెస్ తెలియజేస్తూ జనసేన పార్టీ తరుపున ఓ ప్రకటన విడుదల చేసారు. 2016 కష్టాలతోనే గడిచిందని, 2017లో అయినా ప్రజల ఆశలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు.

pawan kalyan

'నా తరుపున, జన సేన శ్రేణుల తరుపున దేశ ప్రజలందరికీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016 ఎన్నో కష్టాలను ప్రజలకు చవి చూపించి వెళ్లి పోయింది. కరెన్సీ రద్దు రూపంలో సామాన్యులను కాటేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను అదని మావి పండుగా మార్చింది. కానీ 2017 మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను సంపూర్తిగా నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రగతి పదంలో పయనించాలని మనసారా కోరుకుంటూ జై హింద్.' అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

English summary
2017 New Year Wishes from Pawan Kalyan. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu