»   »  వెంకటేష్ అమేజింగ్ స్పీచ్ 2015 తానా (వీడియో)

వెంకటేష్ అమేజింగ్ స్పీచ్ 2015 తానా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS) తెలుగు సంబరాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోగ్రాంకు వెంకటేష్ ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. జూలై 2 నుంచి 4 వ తేదీ వరకూ ఈ సంబరాలు జరగాయి. ఈ సంబరాలుకు ఛీఫ్ గెస్ట్ గా వెంకటేష్, ఆయన సోదరుడు సురేష్ బాబు హాజరయ్యారు. అక్కడ వెంకటేష్ తన దైన శైలిలో అద్బుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ లో ఆయనేం మాట్లాడారో ఇక్కడ చూడండి. 

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క వెంకీ చేతుల మీదుగా...

తెలుగు భాషకు కృషి చేస్తున్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు 'తానా ఎన్టీఆర్‌ అవార్డు'ను వెంకటేష్‌ చేతుల మీదుగా అందజేశారు.

సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ,'తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు ఆచార వ్యవహారాలను, తెలుగు జీవన విధానాలను సముద్రాలు దాటినా కూడా పాటిస్తున్న అమెరికాలోని తెలుగువారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 'తానా'కు ధన్యవాదాలు. దీంతోపాటు ఈ అవార్డును విక్టరీ వెంకటేష్‌ చేతుల మీదుగా అందుకోవడం మరింత సం తోషంగా ఉంది' అని అన్నారు.

Venkatesh

'నందమూరి రామాయణం.. నందమూరి పారాయణం..' అంటూ ఎన్టీఆర్‌ జీవితకథను ప్రతిబింబించేలా పద్యాన్ని పాడి సుద్దాల అశోక్‌ తేజ అందరినీ అలరించారు.

ఇక యుఎస్ లోని రెండు జాతీయ స్థాయి ప్రవాస తెలుగు సంఘాలు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్‌) తమ ద్వైవార్షిక మహాసభలను గురు, శుక్ర, శనివారాల్లో నిర్వహించాయి. గురువారం సాయంత్రం విందు కార్యక్రమంతో రెండు చోట్లా వేడుకలు మొదలయ్యాయి.

ఈ తానా 20వ మహాసభలను డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్‌, అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. అలాగే..... నాట్స్‌ 4వ మహాసభలు లాస్‌ఏంజెలెస్‌లోని అనహేం కన్వెన్షన్‌ సెంటర్‌లో సమన్వయకర్త ఆలపాటి రవి నేతృత్వంలో జరుగుతున్నాయి.

ఇక నాట్స్‌ సంబరాల్లో .. నందమూరి బాలకృష్ణ, గ్రంథి మల్లికార్జున రావు, పీపీ రెడ్డి, జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు, జస్టిస్‌ శేషసాయి, నిమ్మగడ్డ ప్రసాద్‌, త్రిష, కాజల్‌ అగర్వాల్‌, నిషా అగర్వాల్‌, విమలా రామన్‌, కమలిని ముఖర్జీ, అనూప్‌ రూబెన్స్‌, వందేమాతరం, సిరాశ్రీ, గజల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అలాగే... తనికెళ్ల భరణి, గీతామాధురి, భాస్కరభట్ల, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఇప్పటికే చేరుకున్నారు.

ఇక , తానా ప్రారంభోత్సవంలో పాల్గొనే అతిథులు నాట్స్‌ ముగింపు వేడుకలకు, నాట్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనే ప్రముఖులు తానా ముగింపు ఉత్సవాలకు హాజరయ్యేలా, రెండు సభలకూ హాజరయ్యే తెలుగువారందరితో సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవటం విశేషం.

English summary
Venkatesh speech 20th Anniversary Celebrations of TANA at Detroit, USA.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu