సూపర్ స్టార్ అభిమాని ఉన్మాదం: హీరోయిన్‌కు రేప్, యాసిడ్ ఎటాక్ బెదిరింపు... అరెస్ట్!
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
సినిమా స్టార్ల అభిమానుల్లో వీరాభిమానులు వేరయా... వీరాభిమానుల్లో ఉన్మాదంగా ప్రవర్తించే అభిమానులు వేరయా... అన్నట్లు ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు, సోషల్ మీడియాలో వారు చేస్తున్న ఉన్మాద చేష్టలు చూస్తూనే ఉన్నాం. ఇలా ఉన్మాదంగా ప్రవర్తించిన ఓ అభిమాని చివరకు అరెస్ట్ అయిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి అభిమాని అతడు.
హీరోయిన్‌ను టార్గెట్ చేసిన మమ్ముట్టి ఫ్యాన్స్
మమ్ముట్టి నటించిన ‘కసాబా' చిత్రంలో మహిళలను కించ పరిచే డైలాగులు ఉండటంతో... ఒక సూపర్ స్టార్ నోట ఇలాంటి డైలాగులు ఉండటం ఏమిటీ అంటూ కేరళ హీరోయిన్ పార్వతి విమర్శించింది. దీంతో కొందరు మమ్ముట్టి అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు.
రేప్, యాసిడ్ ఎటాక్ చేస్తామంటూ బెదిరింపు
కొందరు అభిమానులు పార్వతి పట్ల ఉన్మాదంగా ప్రవర్తించారు. రేప్ చేస్తామని, యాసిడ్ ఎటాక్ చేస్తామని బెదిరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఎస్ ప్రింటో అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఐటి యాక్ట్ కింద ఇంటిమిడేషన్, సెక్సువల్ అబ్యూస్ కేసులు పెట్టారు.
మరికొందరి కోసం గాలింపు
పార్వతి మీనన్ కేసు విషయంలో వేధింపులకు పాల్పడిన, చంపుతామని బెదిరించిన మరికొందరిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మలయాళం సూపర్ స్టార్ అభిమానులు కావడంతో కేరళలో ఈ అరెస్టులు హాట్ టాపిక్ అవుతున్నాయి.
స్పందించని ఇతర స్టార్స్
పార్వతి ఇష్యూలో మలయాళం ఇండస్ట్రీలో ఇతర స్టార్లు ఎవరూ స్పందించడం లేదు. సూపర్ స్టార్ మమ్ముట్టి సినిమాకు లింకు ఉన్న వ్యవహారం కావడంతో ఈ ఇష్యూపై మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడటం లేదు.
A 23-year-old Kerala man from Thrissur has been arrested after Parvathy complained to the police about the vicious abuse, threats of rape and acid attacks. The arrested man, CS Printo, has been charged for intimidation and sexual abuse under the IT Act.
Story first published: Thursday, December 28, 2017, 11:01 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more