»   »  24 సహనానికి పరీక్షేనా... ?

24 సహనానికి పరీక్షేనా... ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడంటే 3 గంటల పాటు ఉన్న సినిమాల్ని కూడా ఓపిగ్గా చూసేవాళ్ళు ప్రేక్షకులు.రెండున్నర గంటల సినిమా అంటే కనీస నిడివి అన్నట్టుండేది. కానీ క్రమేపీ ట్రెండు మారింది. ఇప్పుడు అంత ఓపికగా థియేటర్ లో కూర్చునే ప్రేక్షకులు తక్కువ. మామూలుగానే సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే బి,సి సెంటర్ల అడియన్స్ కి పెద్దగా ఎక్కదు.

ఎంటర్టైన్మెంట్ పార్ట్ తక్కువుంటుంది కాబట్టి.. కంటెంట్లో ఏదైనా తేడా వస్తే బోర్ కొట్టడానికి ఆస్కారముంది. ఐతే ఇదివరకు "మనం" సినిమాను సైతం ఎక్కువ నిడివిలోనే రూపొందించాడు విక్రమ్. . ఆ సినిమాకు లెంగ్త్ అన్నది ఏమాత్రం ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ప్రేక్షకుడికి కావల్సినంత ఎంటర్ టైన్మెంటుంది.

ఇదివరలో వచ్చిన మహేష్ సినిమా "1నేనొక్కడినే" , "సూర్య సినిమనే అయిన 7th సెన్స్ లే ఉదాహరణ. అందులోనూ 2 గంటల 44 నిమిషాల నిడివి అంటే.కంటెంట్ లో ఏమాత్రం తేడా ఉన్నా అది సినిమా సక్సెస్ మీదే ప్రభావం చూపే చాన్సుంది.

 24 movie runtime is High it may effect the succes rate..!?

24 ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా. ట్రైలర్ చూస్తేనే ఇందులో చాలా విషయం ఉందని. సినిమా లొ విక్రమ్ కుమార్ చాలానే చెప్పాలని చూశాడని, సినిమాలో ఎన్నో మలుపులు ఉంటాయని అర్థమవుతోంది. ఈ తరహా సినిమాల్ని తక్కువ నిడివితో ముగించడం కష్టమే. అలాగని నిడివి మరీ ఎక్కువైనా కూడా కష్టమే.

" 24"స్క్రీన్ ప్లే లో కూడా ఆ రేంజ్ పట్టూ, ఆసక్తి చూపించగలిగితే..... సినిమా నిడివి గురించి జనాలు పట్టించుకోరు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినీ,నిర్మాతలకి ఎలాంటి అనుభవాన్నీ ఇస్తుందో చూడాలి. ఈ శుక్రవారమే "24" ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అప్పుడే అన్ని విషయాలూ అర్థమయ్యేది.

English summary
The film's total running time is 164 minutes 31 seconds. which would come close to two hours and 45 minutes...
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu