twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమ్మలేని నిజం : 256 సినిమాలపై సెన్సారు బోర్డు నిషేధం

    By Srikanya
    |

    ముంబయి : పదేళ్లలో వివిధ భాషలకు చెందిన 256 చిత్రాలను సెన్సారు బోర్డు నిషేధించింది. వీటిలో 78 హిందీ చిత్రాలు, 52 ఇంగ్లిష్‌, 51 తమిళ, 33 కన్నడ, 15 తెలుగు, 14 మలయాళ, ఇతర భాషలకు చెందిన మరో 13 చిత్రాలున్నాయి. సామాజిక కట్టుబాట్లను కించపరిచే విధంగా ఉండటం, అశ్లీలం, జుగుప్సాకరం, అభ్యంతరకర సన్నివేశాలు, మాటలు, పాటలు, దుస్తులు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ చిత్రాలపై బోర్డు వేటు వేసింది. అయితే వీటిని తొలగించేందుకు దర్శక, నిర్మాతలు ససేమిరా అనడంతో కొన్ని అసలు విడుదలే కాలేదు.

    2011లో కల్‌ ఆజ్‌ కల్‌ అనే బెంగాలీ చిత్ర ప్రదర్శనపై సెన్సారు బోర్డు నిషేధం విధించింది. దీంతోపాటు ఒక గుజరాతీ, 2 భోజ్‌పురి చిత్రాలపై సెన్సారు బోర్డు వేటు వేసింది. ముంబయి అమ్‌చీచ్‌, మాస్తర్‌ ఎకే మాస్తర్‌ సహ 5 మరాఠీ చిత్రాలను నిషేధించారు. నిషేధానికి గురైన హిందీ చిత్రాల్లో అశ్లీల దృశ్యాలు అధికంగా ఉన్నాయి.

    ఆదంఖోర్‌ హసీనా, ఖూనీ రాత్‌, ఆగ్‌హై ఏ బదన్‌ చిత్రాలను నిషేదించారు. దేశ చలనచిత్ర పరిశ్రమ ఆరంభంలో బాబారావు పెయింటర్‌ 'కీచక్‌వధ్‌' పేరిట ఒక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కీచకుడి వధ సన్నివేశం ఎంత భయంకరంగా ఉందంటే ప్రేక్షకులు సినిమా థియేటర్‌ వెలుపలికి పరుగెత్తుకొచ్చారు. దీంతో బ్రిటిషు సర్కారు ఈ చిత్రాన్ని సమీక్షించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించింది. నేటి సెన్సారు బోర్డుకు నిర్ణయాలకు ఆ నిర్ణయం నాంది పలికింది. కాలగమనంలో భావ ప్రకటన స్వేచ్ఛ, పరిమితుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. 'ది మెక్సికన్‌' వంటి వినోద చిత్రాన్ని కూడా సెన్సారుబోర్డు నిషేధించడం గమనార్హం.

    ఇదిలా ఉంటే బెంగుళూరు నగరంలో....హిందూ, ముస్లిం కుటుంబాల్ని ఇతివృత్తంగా తీసుకుని తీస్తున్న అయోథ్యపురం చిత్రాన్ని విడుదల చేయకుండా అడ్డుకోవాలంటూ వేర్వేరు సంఘాల ప్రతినిధులు మైసూరు బ్యాంకు కూడలి వద్ద శనివారం ధర్నాకు దిగారు. మహిళల్ని తక్కువ చేసి చూపించటం, చిన్న వయసులోనే ప్రేమలు, హింసాత్మక ఘటనల్ని పెద్దగా చేసి చూపుతున్న సినిమాలకు సెన్సారు బోర్డు అనుమతుల్ని ఇవ్వకూడదని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఆందోళనకు మద్దతుగా సైన్యంలో పని చేస్తున్న సిబ్బంది మద్దతు పలికారు. పాత సినిమా రీళ్లను దిష్టిబొమ్మపై వేసి దగ్ధం చేసి, చిత్రానికి వ్యతిరేకంగా నినాదాల్ని చేశారు.

    English summary
    Between 2001 and 2011, a total 256 films have been denied certification by the Central Board of Film Certification, as per the information obtained by Lucknow based RTI (Right to Information) activists Amitabh and Nutan Thakur. The maximum number of films denied certification in one year was 59 in 2006, followed by 33 films in 2002 and 31 in 2004. Only 9 films were denied certification in 2010.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X