»   » జయ జానకి నాయకలో బీచ్ సాంగ్.. మూడు కోట్లతో భారీ సెట్..

జయ జానకి నాయకలో బీచ్ సాంగ్.. మూడు కోట్లతో భారీ సెట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విడుదలకు ముందే జయ జానకి నాయక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు హంగామా చేస్తున్నాయి. ఈ చిత్రం కోసం భారీ రేంజ్‌లో ఓ పాటను చిత్రీకరించేందుకు సిద్దమవుతున్నారు. మూడు కోట్ల రూపాయలతో విశాఖపట్నం సమీపంలో భారీ సెట్‌ను చిత్ర యూనిట్ నిర్మించింది. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రగ్యా జైస్వాల్‌పై రొమాంటిక్ బీచ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు.

  ఆగస్టు 11న జయ జానకి నాయక

  ఆగస్టు 11న జయ జానకి నాయక

  సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఆగస్టు 11న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

  సినిమాకు బెంచ్ మార్క్‌లా

  సినిమాకు బెంచ్ మార్క్‌లా

  చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ ఈ పాట చిత్రీకరణ గురించి మాట్లాడుతూ.. "ఖర్చుకు వెనుకడుగు వేయకుండా "జయ జానకి నాయక" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి అని అన్నారు.

  3 కోట్లతో భారీ సెట్

  3 కోట్లతో భారీ సెట్

  సినిమాను రిచ్‌గా నిర్మించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి బీచ్ సాంగ్ కోసం వైజాగ్ లో 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ భారీ సెట్ ను నిర్మించాం. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రగ్యాజైస్వాల్ కాంబినేషన్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నాం. ఆగస్ట్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.

  తెర వెనుక.. తెర ముందు..

  తెర వెనుక.. తెర ముందు..

  ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను

  English summary
  Jaya Janaki Nayaka is an upcoming Telugu action movie featuring Bellamkonda Srinivas and Rakul Preet Singh in lead roles. Pragya Jaiswal, Aadhi Pinisetty, Jagapati Babu and Sarat Kumar will be seen in supporting roles in the movie. Reports suggest that, the makers are shooting a glamorous beach festival song on Srinivas and Pragya. The expenditure for this song is estimated to be Rs 3 crore. A lavish set is built in Vishakapatnam and it is said, about 500 dancers from both India and foreign countries will be seen dancing next to the actors.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more