»   » ఈ వారం సినివారం: మూడు సినిమాలూ, ముగ్గురు దర్శకులు

ఈ వారం సినివారం: మూడు సినిమాలూ, ముగ్గురు దర్శకులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినివారం వేదికగా ప్రతిభావంతులైన లఘు చిత్రాల రూపకర్తలకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తోడ్పాటునందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో వారు రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను సినివారం శీర్షికతో ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

3 movies in This week in Sinivaram

ఈ వారం సినీ వారం లో భాగంగా మూడు షార్ట్ ఫిలిం లు ప్రదర్శించనున్నారు. సూర్య చంద్ర దర్శకత్వం లో వచ్చిన "చోటూ", రామానుజ పురం శశాంక్ దర్శకత్వం లో వచ్చిన "బ్యూటీఫుల్ లైఫ్", విజయ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన "సినిమా పిచ్చోడు" సినిమాల ప్రదర్శన జరగనుంది.

3 movies in This week in Sinivaram

ఈ కార్యక్రమంలో ఔత్సాహిక యువ ఫిల్మ్ మేకర్స్ కోసం సినివారం రూపకర్త సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఈ రెండు సినిమాల దర్శక నిర్మాతలు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అతిథులు, సినీ ప్రేమికులు, యువ ఫిల్మ్ మేకర్స్, సినివారం కుటుంబం నరేంధర్ గౌడ్, అక్షర కుమార్, సంఘీర్, ఎమ్మెస్ విష్ణు, శివ కట్టా, మహేష్ బాబు లతో పాటు పలువురు పాల్గొంటారు.

English summary
This week in Sinivaram tree short films going to be screened, program sceduled 15 july 2017 evening 5pm to 9pm
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu