»   » హేమ చెప్పుతో కొట్టినట్లు చెప్పింది: 30 ఇయర్ పృధ్వి సంచలనం!

హేమ చెప్పుతో కొట్టినట్లు చెప్పింది: 30 ఇయర్ పృధ్వి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాస్టింగ్ కౌచ్....అంశం ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొందరు హీరోయిన్లు ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను నిర్మొహమాటంగా బయట పెడుతున్నారు. తమతో పడుకుంటేనే అవకాశాలు, సెక్స్ సుఖం అందిస్తేనే చాన్సులు ఇస్తామని చెప్పే దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారని సంచలన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పరిణామాలపై 30 ఇయర్స్ పృధ్వి ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తనదైన రీతిలో స్పందించారు. ఇంటర్వ్యూల్లో ఇలాంటి విషయాలు బయట పెడుతున్న వారిని తనదైన రీతిలో ఏకి పారేసారు.

హేమ చెప్పుతో కొట్టినట్లు చెప్ిపంది

హేమ చెప్పుతో కొట్టినట్లు చెప్ిపంది

‘ఇండస్ట్రీలో బ్రతుకుతున్నారు మీరు. ఇండస్ట్రీ ఇచ్చే డబ్బులే తింటున్నారు.... ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా ప్రజల్లో మన చలన చిత్ర రంగం, టీవీ రంగం అంటే చాలా చులకన భావం ఏర్పడేలా చేస్తున్నారు. అలా చేస్తున్న వారికి హేమగారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారు' అని పృధ్వి అభినందించారు.

నువ్వు పిలవకుండానే వచ్చాడా?

నువ్వు పిలవకుండానే వచ్చాడా?

నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, సహనటులు, దర్శకుల గురించి ఇలా ఏది పడితే అలా మాట్లాడటం చాలా దారుణం అని పృధ్వి అన్నారు. ఒకావిడ ఓ డైరెక్టర్, ఓ ప్రొడ్యూసర్ వల్ల తన కెరీర్ నాశనం అయిందని అని స్టేట్మెంట్ ఇస్తుంది. మరొకావిడి నాతో ఒకరు పడుకున్నారని అంటుంది. ఒకావిడ తనను పాడు చేసారని అంటుంది, ఇంకో ఆవిడ అర్దరాత్రి వచ్చి తలుపు కొట్టాడని అంటుంది, తండ్రి లాంటోడు కూతురు లాంటి తనకు కడుపు చేసాడని ఒకరు అంటారు.... స్త్రీ సహకారం లేనిదే ఏది జరుగదు, వీరి సహకారం లేకుండా ఇవన్నీ జరుగాయంటే నేను నమ్మను. ఇండస్ట్రీలో ఇలాంటి వారు ఉన్నారే అనుకుందాం....వారు పిలిచినపుడు నువ్వు ఎందుకు వెళ్లాలి? నువ్వు పిలిచావు కాబట్టే వచ్చి నీ తలుపు కొట్టాడు అంటూ..... కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న వారిపై పృధ్వి విరుచుకుపడ్డారు.

ఇండస్ట్రీలో అలాంటి సంస్కృతి లేదు

ఇండస్ట్రీలో అలాంటి సంస్కృతి లేదు

ఇప్పుడైతే ఇండస్ట్రీలో అలాంటి సంస్కృతి లేదు. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్ వచ్చారు. అందరూ సంస్కార వంతులే ఉన్నారు....ఇష్టమైతే యాక్టర్ చేయాలి, లేకుంటే లేదు కానీ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు పృధ్వి.

సమరం గారి ఇంటర్వ్యూల్లా ఉన్నాయి

సమరం గారి ఇంటర్వ్యూల్లా ఉన్నాయి

ఈ మధ్య ఇంటర్వ్యూ చేసే వారు ప్రిపేర్ చేసే ప్రశ్నలు కూడా అలానే ఉన్నాయి. కావాలనే వారి పర్సనల్ లైఫ్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. వారు అలా అడుగుతున్నారు కాబట్టే హీరోయిన్లు నుండి అలాంటి సమాధానాలు వస్తున్నాయి. ఇవేవో సమరంగారి ఇంటర్వ్యూల్లా ఉన్నాయి అని పృధ్వి అభిప్రాయ పడ్డారు.

English summary
30 years Prithvi sensational comments about casting couch. He said that no casting couch in tollywood industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu