»   » మెగా ఫ్యాన్స్‌తో పెట్టుకోవద్దు: 30 ఇయర్స్ పృథ్వి హాట్ కామెంట్స్

మెగా ఫ్యాన్స్‌తో పెట్టుకోవద్దు: 30 ఇయర్స్ పృథ్వి హాట్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ వైపు సినీ విమర్శకుడు మహేష్ కత్తి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ జరుగుతుండటం, ఈ ఇష్యూపై పలు టీవీ ఛానల్స్ లో చర్చా కార్యక్రమాలు ప్రసారం అవుతున్న తరుణంలో ప్రముఖ తెలుగు నటుడు పృథ్విరాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

పృథ్వి నేరుగా మహేష్ కత్తి మీద కామెంట్స్ చేయలేదు. కనీసం ఆయన పేరు కూడా ఎత్తకుండానే పెద్ద హీరోల గురించి మాట్లాడేప్పుడు తమ లిమిట్స్‌లో తాము ఉండాలని పృథ్వి చెప్పే ప్రయత్నం చేశారు.

చద్దన్నం తినేసి రాసేయడం కాదు

చద్దన్నం తినేసి రాసేయడం కాదు

పెద్ద హీరోల మీద కామెంట్ చేసేపుడు ఒక లిమిట్ ఉండాలి. లేకుంటే ఫ్యాన్స్ సమాధానం చెబుతారు. చద్దన్నం తినేసి పెద్ద హీరోల గురించి ఓ రాసేయడం కాదు. పెద్ద హీరోలకు భారీ సంఖ్యలో అభిమానులు ఉంటారు, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి అని పృథ్వి అన్నారు.

ఎందుకు తిట్టారు అనే హక్కు లేదు

ఎందుకు తిట్టారు అనే హక్కు లేదు

పెద్ద హీరోల గురించి ఒక మాట అనేటపుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు లిమిట్‌గా మాట్లాడనపుడు ఎందుకు తిట్టారు అనే హక్కు నీకు లేదు అంటూ...... పృథ్వి ఫైర్ అయ్యారు.

ఎస్వీ రంగారావు ఉన్నా

ఎస్వీ రంగారావు ఉన్నా

ఈ రోజు మెగా హీరోల గురించి అంటున్నవారు....రేపు పృథ్వి రాజ్‌ను కూడా అతడికి ఏమీ తెలియదు, యాక్టింగ్ రాదు అంటారు. ఎస్వీ రంగారావు లాంటి మహానుభావులు ఇపుడు లేరు. ఉండి ఉంటే ఎస్వీ రంగారావు లాంటి వారికి కూడా యాక్టింగ్ రాదు అనే రకం వీరంతా.... అంటూ పృథ్విరాజ్ తనదైన రీతిలో స్పందించారు.

సినిమాలపై విమర్శలపై

సినిమాలపై విమర్శలపై

క్రిటిక్స్ అని చెప్పుకుంటూ సినిమాలపై విమర్శలు చేసే వారు ఈ మధ్య చాలా మంది తయారయ్యారు. ఇంటలెక్చువల్స్ అని చెప్పుకుంటూ మేధావి వర్గం అని ముసుగేసుకుని ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని పృథ్వి అన్నారు.

English summary
Comedian Prudhvi Raj Strong Comments on Self Proclaimed Critics and about Mega Heroes, Mega Fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu