»   » అమ్మ వెనక ఎవరో ఉన్నారు: 30 ఇయర్స్ పృథ్వి కేసుపై కొడుకు స్పందన!

అమ్మ వెనక ఎవరో ఉన్నారు: 30 ఇయర్స్ పృథ్వి కేసుపై కొడుకు స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వికి విజయవాడ ఫ్యామిలీ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ. 8 లక్షల చొప్పున భార్యకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా పృథ్వి కొడుకు సాయి శ్రీనివాస్ స్పందించారు.

30 ఇయర్స్ పృథ్వికి కోర్టు షాక్: నెలకు 8 లక్షల భరణం చెల్లించాల్సిందే!

అమ్మా, నాన్న మధ్య ఏడాదిగా గొడవలు జరుగుతున్న మాట విస్తవమే అని సాయి శ్రీనివాస్ తెలిపారు. నాన్న షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారని, మా అమ్మను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.

గొడవలు ఉన్న మాట నిజమే కానీ... అమ్మ లీగల్ గా ప్రోసీడ్ అవుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. తనను, చెల్లిని నాన్న ఎంతో బాగా చూసుకుంటారని తెలిపారు. గతంలో అందరం బాగానే ఉన్నాం..కానీ ఏడాది నుంచి ఏం మిస్ అండర్‌స్టాండింగ్స్ వచ్చాయో తనకు తెలియదు.. అప్పటి నుండి అమ్మకు, నాన్నకు, మాకు కూడా మనశ్శాంతి లేదని ఆయన తెలిపారు.

నాన్న ఆర్టిస్ట్‌గా ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ఆయన ఎదుగుతున్న సమయంలో ఇలాంటి అలిగేషన్స్ రావడం విచారకరం. అమ్మను ఇలా చేయడంతో షాకయ్యాను. ఎవరి మాట వినో లీగల్‌గా ప్రోసీడ్ అయి ఉంటారు, అది నిజం కాకపోయి ఉంటే బాగుండేది. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే గొడవ లాగే వీరి మధ్య జరిగిందని తెలిపారు. మా అమ్మ వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని అనుకుంటున్నా. కోర్టు వివాదాన్ని కోర్టులోనే పరిష్కరించుకుంటామని సాయి శ్రీనివాస్ తెలిపారు.

English summary
30 years Prudhvi son Sai Srinivar responda over his father and mother alimony case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu