»   » నా భార్యకు చెడ్డ మొగుడు దొరికాడు: రామ్ గోపాల్ వర్మ (ఫోటోస్)

నా భార్యకు చెడ్డ మొగుడు దొరికాడు: రామ్ గోపాల్ వర్మ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు ప్రముఖ దర్శకుడిగా....ఈ మధ్య కాలంలో చెత్త సినిమాలు తీస్తున్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘365 డేస్' అనే సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందు, అనైక సోఠి జంటగానటించిన ఈ చిత్రాన్ని డి.వి.క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మించారు. ఈ చితక్రానికి సంబంధించిన ఆడియో వేడుక గురువారం తాజ్ డెక్కన్ లో జరిగింది. ఈ ఆడియో వేడుకకు పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...‘మగాడు లేకుండా ఆడది, ఆడది లేకుండా మగాడు బ్రతకలేరు. వాళ్లిద్దరూ కలిసి అసలు బ్రతకలేరు. రామూగారితో నాది ఇరవయ్యేళ్ల బంధం. ఏ రిలేషన్ షిప్ ని అయినా కాపాడుకుంటూ వస్తేనే అది ఉంటుంది. లేకుంటే ఏ రిలేషన్ షిప్ అయినా నిలబడదు. 365 డేస్ మూవీ అందరికీ గ్యారంటీగా నచ్చుతుంది అన్నారు.

ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో వి.వి.వినాయక్, ఛార్మీ, ఉత్తేజ్, కోన వెంకట్, పోసాని కృష్ణమురళి, సురభి, సిరాశ్రీ, పూనమ్ కౌర్, నవీన్ యాదవ్, రాంసత్యనారాయణ, మ్యాంగో వంశీ, రాజ్ కందుకూరి, సి.వి.రావు, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని విరవాలు ఫోటోలు

సినిమా గురించి వర్మ..

సినిమా గురించి వర్మ..


ఓ జంట ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమా స్ర్కీన్ ప్లే ని రూపొందించడం జరిగింది. ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు ఉండవు. 365 డేస్ చిత్రం నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో క్రైమ్ లేదు. మంచి ఎమోషన్స్ తో ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నారు.

తన పెళ్లి ఫోయిల్యూర్ గురించి

తన పెళ్లి ఫోయిల్యూర్ గురించి


నన్ను చాలామంది మీ పెళ్లి ఎందుకు ఫెయిలయ్యిందని అడుగుతారు. దానికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.... నాకు మంచి భార్య దొరికింది. కానీ నా భార్యకి ఒక చెడ్డ మొగుడు దొరికాడు అని చెబుతుంటాను.

మ్యూజిక్ డైరెక్టర్

మ్యూజిక్ డైరెక్టర్


మ్యూజిక్ డైరెక్టర్ నాగ్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ...'నేను చాలామంది డైరెక్టర్స్ తో వర్క్ చేసాను. కానీ రాంగోపాల్ వర్మలాంటి దర్శకుడి సినిమాకి పాటలందించడం అంటే అంత ఈజీ కాదు. సంగీతంపై అతనికి మంచి అవగాహన ఉంది. ఆయనకు ఎలాంటి పాటలు కావాలో తెలుసు. ఈ సినిమాకి మంచి పాటలు కుదిరాయి అన్నారు.

నందు మాట్లాడుతూ..

నందు మాట్లాడుతూ..


సినిమా చేసేప్పుడు రామూగారు ఓ విషయం చెప్పారు. పదేళ్ల తర్వాత నేను చేస్తున్న లవ్ స్టోరీ అని, ఇదే నా మొదటి సినిమాలా ఫీలవుతున్నానని చెప్పారు. మంచి ఎమోషన్స్ తో రామూగారు తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు.

English summary
Telugu movie 365 days audio launch which was held on April 23,2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu