»   »  అమ్మాయి మోసం కేసు : '3జి లవ్' చిత్రం నిర్మాత అరెస్ట్

అమ్మాయి మోసం కేసు : '3జి లవ్' చిత్రం నిర్మాత అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విజయనగరానికి చెందిన కోలగట్ల ప్రతాప్ కుమార్ ని కరీంనగర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రతాప్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని సినిమా అవకాశాలు కలిపిస్తానని చెప్పి మోసగించినట్లు కరీంనగర్ కి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడుని విజయనగరంలో అదుపులో తీసుకుని కరీంనగర్ తరలించారు. ప్రతాప్ పై 417,420 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు.

3G Love producer arrested

వివరాల్లోకి వెళితే...కరీంనగర్ లో విద్యానగర్ కి చెందిన ఓ యువతి(24) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఫేస్ బుక్ లో విజయనగరానికి చెందిన కోలగట్ల ప్రతాప్ కుమార్(28)పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ తరుచూ హైదరాబాద్ లో కలుసుకునేవారు. కొంతకాలం పాటు సజావుగా సాగిన లవ్ స్టోరీ పెళ్లి దగ్గరకి వచ్చేసరికి మలుపు తిరిగింది. తనను వివాహం చేసుకోవాలని సదరు యువతి ఒత్తిడి చేయటంతో ప్రతాప్ కుమార్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతని గురించి విచారించగా అప్పటికే పెళ్ళై,రెండేళ్ల కుమారుడు ఉన్నట్లు ఆమెకు తెలిసింది.

దీంతో తనను మోసం చేసాడంటూ ఆమె ఈ నెల ఎనిమిదవ తేదీన కరీం నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రతాప్ పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం సాయింత్రం విజయనగరంలో ఉన్న ప్రతాప్ ని అదుపులో తీసుకుని కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు. చివరకు సదరు యువతి, ప్రతాప్ రాజీ కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే కేసు నమోదు అయినందున కోర్టులో రాజీ చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో వారు కోర్టుని ఆశ్రయించినట్లు సమాచారం.

English summary

 Kareemnagar police on arrested 3G Love producer Pratam Kumar Kolagatla (28) in Vijayanagaram and bought him to Two Town police station. Police acted on the complaint given by a 24yrs old girl on 8th, Jan after he cheated her promising her to marraige She later complained upon which police arrested him and later came to an understanding. But Police told them since a case has been filed they should come to an understanding in court. Now both approached court for settlement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu