అనుష్క...ఆభరణాలకే అయిదు కోట్లు
ఇందు నిమిత్తం హిందీ చిత్రం 'జోథా అక్బర్'కి పనిచేసిన నీతా లుల్లా 'రుద్రమదేవి'కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. షూటింగ్ కి నిజమైన బంగారం, వజ్రాభరణాల్ని వినియోగిస్తున్నారు. అందులో భాగంగానే నగల కోసం అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 35 శాతం చిత్రీకరణ పూర్తయింది.
దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ ''ఇప్పటిదాకా చిత్రీకరించిన సన్నివేశాలని త్రీడీ ఐమ్యాక్స్‌లో ప్రదర్శించి చూసుకొన్నాం. ఎంతో సంతృప్తినిచ్చాయి. 'జోథా అక్బర్'లో ఐశ్వర్యారాయ్ ధరించిన ఆభరణాలకు ఎంతగా పేరొచ్చిందో అంతకంటే ఎక్కువ పేరు ఇందులోని ఆభరణాలకు వస్తుంది. నీతూ లుల్లా ఆభరణాలని చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతినాయక లక్షణాలుండే హరిహరదేవుడు పాత్రలో సుమన్ నటిస్తున్నారు. డిసెంబరులోపు చిత్రీకరణ పూర్తి చేస్తామ''ని తెలిపారు.
ఈ నెల 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన వేయి స్తంభాల గుడి సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సుమన్ ప్రతినాయకుడిగా నటిస్తారు. కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, నథాలియా కౌర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఇళయరాజా.


Click it and Unblock the Notifications












